కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా హ్యాపీగా ఉందని, ఎన్నో మంచి పాత్రలు చేశానని చెప్పారు. హీరో నుంచి కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశానని, ఏ పాత్ర ఇచ్చినా సంతోషంగా చేసేవాడినని తెలిపారు. తనకు ఇష్టమైన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అని, ఇష్టమైన ప్రదేశం ఊటీ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పట్లో బ్రహ్మానందం తమ ఇంటికి దగ్గర్లోనే ఉండేవారని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారని తెలిపారు. తమిళనాడులో తనకు ఆస్తులు కూడా ఉండేవని, కానీ వాటిని అమ్మేసినట్టు చెప్పారు. తమిళం తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు రావడం ఇక్కడి(హైదరాబాద్)కి షిఫ్ట్ అయినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తన కొడుకు కూడా త్వరలో ఇండస్ట్రీలోకి వస్తారని చెప్పారు సుధాకర్.