నటుడిగా, పొలిటీషియన్‌గా, హోస్ట్ గా సక్సెస్‌ అయిన బాలకృష్ణ, ఆ ఒక్క విషయంలో మాత్రం ఫెయిల్యూర్‌

Published : Jun 10, 2025, 11:05 AM IST

నందమూరి బాలకృష్ణ నేడు తన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అటు హీరోగా వరుస విజయాలతో ఉన్నారు. మరోవైపు రాజకీయ నాయకుడిగానూ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ కొట్టారు. దీంతో ఈ పుట్టిన రోజు చాలా స్పెషల్‌గా నిలిచింది.

PREV
16
సీనియర్లలో అత్యంత సక్సెస్‌ఫుల్‌ హీరోగా బాలకృష్ణ

ఎన్టీ రామారావు నటవారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఆయన బాటలోనే పయణిస్తున్నారు బాలయ్య. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. మాస్‌ హీరోగా రాణిస్తున్న బాలయ్య ఇటీవల కాలంలో వరుసగా విజయాలు అందుకుని అత్యంత సక్సెస్‌ ఫుల్‌గా హీరోగా నిలిచారు. సక్సెస్‌ పరంగా ఇప్పుడు సీనియర్లలో బాలయ్యనే టాప్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

26
`అఖండ 2` తో డబుల్‌ హ్యాట్రిక్‌కి రెడీ

బాలకృష్ణకి `అఖండ` నుంచి వరుసగా విజయాలు వరిస్తున్నాయి. `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి`, `డాకు మహారాజ్‌` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఈ నాలుగూ వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాయి. సీనియర్లలో ఇది అరుదైన ఘనత అని చెప్పొచ్చు. ఇప్పుడు `అఖండ 2`తో రాబోతున్నారు. డబుల్‌ హ్యాట్రిక్‌ కి రెడీ అవుతున్నారు.

36
రాజకీయాల్లో హ్యాట్రిక్‌ కొట్టిన బాలయ్య

హీరోగా మోస్ట్ సక్సెస్‌ ఫుల్‌గా రాణిస్తున్న బాలయ్య.. పొలిటీషియన్‌గానూ సక్సెస్‌ అయ్యారు. తన తండ్రి రామారావు నియోజకవర్గం అయిన హిందూపురం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన నియోజకవర్గంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా రాజకీయంగానూ విజయం సాధిస్తున్నారు ఎన్బీకే.

46
హోస్ట్ గా దుమ్ములేపుతున్న బాలకృష్ణ

మరోవైపు హోస్ట్ గానూ విజయవంతంగా రాణించారు. బాలయ్య హోస్ట్ గా మారి `అన్‌ స్టాపబుల్‌` టాక్ షో చేసిన విషయం తెలిసిందే. `ఆహా`లో ప్రసారం అయిన ఈ షో ఇండియాలోనే అత్యంత విజయవంతమైన టాక్‌ షోగా నిలిచింది. టాప్‌ రేటింగ్‌ని కూడా సొంతం చేసుకుంది. ఇలా బాలయ్య ఏ రంగంలోనూ అడుగుపెట్టినా, అందులో సక్సెస్‌ అయ్యారు. కానీ ఒక్క విషయంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయారు.

56
నిర్మాతగా సక్సెస్‌ కాలేకపోయిన బాలకృష్ణ

బాలకృష్ణ నిర్మాతగా సక్సెస్‌ కాలేకపోయారు. ఆయన తన తండ్రి బయోపిక్‌ `ఎన్టీఆర్` చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై నిర్మించారు. ఎన్బీకే ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ని స్టార్ట్ చేసి, `ఎన్టీఆర్‌` బయోపిక్‌ని నిర్మించారు. సుమారు 50-60కోట్లు ఖర్చు చేసి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా నిర్మించారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్యనే.. తన తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. నటుడిగా సక్సెస్‌ అయ్యారు, కానీ నిర్మాతగా సక్సెస్‌ కాలేదు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

66
కొడుకు చిత్రంతో అయినా సక్సెస్‌ అవుతాడా?

ఇదే కాదు అంతకు ముందు కూడా సహనిర్మాతగా వ్యవహరించారు. `సుల్తాన్‌` చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిజాస్టర్‌. పలు సినిమాలకు పరోక్షంగా సహకరించారు. అవి కూడా ఆడలేదు. బాలయ్య నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. 

ఇక తన కూతురు తేజస్విని ని ప్రొడక్షన్‌లోకి దించారు. తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఓ మూవీని ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఆదిలోనే ఆగిపోయింది. దీంతో బాలయ్య నిర్మాతగా మారిన ప్రయత్నాలు వరుసగా బెడిసికొడుతున్నాయి. 

అయినా వెనకడుగు వేసే ఛాన్స్ లేదు. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తానే నిర్మించే అవకాశం ఉంది. అలాగే `ఆదిత్య 999` మూవీని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీని కూడా ఆయనే నిర్మించే అవకాశాలున్నాయి. మరి వీటితోనైనా సక్సెస్‌ అవుతారేమో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories