హాట్‌ షోతో విజువల్‌ ఫీస్ట్ నిచ్చిన మెహరీన్‌.. ఎట్టకేలకు మంచిరోజులొచ్చాయట..

First Published | Oct 27, 2021, 5:38 PM IST

పంజాబీ భామ సందడి షురూ చేసింది. తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ సందడి చేసేందుకు రెడీ అవుతుంది. `ఎఫ్‌2 తర్వాత ఆ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తుంది. ఇక తనకు మంచిరోజులొచ్చాయని చెబుతుంది. అంతేకాదు హాట్‌ ఫీస్ట్ నిచ్చింది. 

`ఎఫ్‌2` భామగా ఫేమస్‌ అయిన మెహరీన్‌(Mehreen) ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుని సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. కెరీర్‌ పరంగా దూసుకుపోయేందుకు రెడీ అవుతుంది. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ వరుస సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తుంది. అందులో భాగంగా మెహరీన్‌ ప్రస్తుతం `మంచి రోజులొచ్చాయ్‌`(Manchi Rojulochaie) చిత్రంలో నటిస్తుంది. ఇందులో `ఏక్‌ మినీ కథ` ఫేమ్‌ సంతోష్‌ శోభన్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది మెహరీన్‌.
 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌ కి రెడీ అవుతుంది. తాజాగా యూ/ఏ సెన్సార్‌ రిపోర్ట్ ని దక్కించుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. నవంబర్‌ 4న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. డైరెక్టర్‌ మారుతి నుంచి రాబోతున్న చిత్రమిది. Mehreen హీరోయిన్‌గా, సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించడంతో సినిమాపై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో తనకు మంచి రోజులొస్తాయని భావిస్తుంది మెహరీన్‌.


ఇదిలా ఉంటే ఇటీవల మెహరీన్‌ సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా పాత్రకి, మంచి కథలకు ప్రయారిటీ ఇస్తుంది. పైగా మారుతి మేకింగ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో మినిమమ్‌ గ్యారంటీ అనే టాక్‌ని తెచ్చుకుంటోంది. దీంతో సైలెంట్‌గా బజ్‌ క్రియేట్‌ చేసిందీ చిత్రం. ఇందులో మెహరీన్‌ రోల్‌ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.

మెహరీర్‌ గ్లామర్‌ పరంగా ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిందే. కెరీర్‌ ప్రారంభం నుంచి ఈ భామ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గలేదు. సాధ్యమైనంత వరకు హాట్‌ షోతో రెచ్చిపోయింది. ఇప్పుడు మరోసారి అభిమానులకు విజువల్‌ ఫీస్ట్ నిచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో మెహరీన్‌ హాట్‌ షో కుర్రాళ్లకి మతిపొగొడుతుంది. అందాల ఆరబోతలో ఇది నెక్ట్స్ లెవల్‌ అంటున్నారు నెటిజన్లు. 

మెహరీన్‌ `ఎఫ్‌2` సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. అందులో తమన్నాతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ వైపు మిల్కీ బ్యూటీ, మరోవైపు ఆ మిల్కీకి ఏమాత్రం తగ్గని అందంతో మెహరీన్‌ స్కిన్‌ షో చేసి సినిమాకి గ్లామర్‌ డోస్‌ని అద్దారు. బబ్లీ రోల్‌లో మెప్పించింది మెమరీన్‌. ఇప్పుడు మరోసారి `ఎఫ్‌3`తో రాబోతుంది. ఈసినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల కాబోతుంది. దీంతో రెండు నెలల్లో రెండు సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆడియెన్స్ ని కనువిందు చేయబోతుంది. 

ఇవే కావు మెహరీన్‌ బ్యాగ్‌లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయట. బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు స్లిమ్‌గా మారడంతో మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే ఈ హాట్‌ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. చివరగా మెహరీన్‌ `అశ్వథ్థామ` చిత్రంలో నటించింది. నాగశౌర్యతో జోడీ కట్టిన ఈ చిత్రం గతేడాది విడుదలైన యావరేజ్‌ టాక్‌ని తెచ్చుకుంది. 
 

ఇదిలా ఉంటే మెహరీన్‌.. హర్యానా మాజీ సీఎం బజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టాక మ్యారేజ్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేశారు. కానీ అది పలు మార్లు పోస్ట్ పోన్‌ అవుతూ వచ్చింది. ఇంతలో.. అంటే జులైలో తమ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌ అంటూ ప్రకటించి షాకిచ్చింది మెహరీన్‌. ఇప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

also read: వైరల్‌ అవుతున్న సమంత పోస్ట్.. కూతుళ్లని పెళ్లికోసం కాదు తనకోసం బతికేలా పెంచండి అంటూ..
also read: అమలాపాల్‌ సంచలనం.. ఇండియన్‌ సినిమాలోనే ఫస్ట్ టైమ్‌.. బర్త్ డే రోజు క్రేజీ అప్‌డేట్‌..

Latest Videos

click me!