సమంత.. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం ఆ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ నుంచి, ఆ మానసిక సంఘర్షణ నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. తనని తాను తెలుసుకునేందుకు, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంది. రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌పై ఫోకస్ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. అందుకోసం తనని వెంటాడుతున్న కన్నీటి జ్ఞాపకాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తుంది.
Samantha ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్‌ని ఎంజాయ్ చేసింది. మరోవైపు ఆధ్యాత్మిక యాత్రని కూడా పూర్తి చేసింది. మరోవైపు ఇప్పుడు విదేశీ టూర్ ప్లాన్ చేసింది. దుబాయ్‌కి సమంత వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్, స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కేర్ కూడా ఉన్నారు. ఫారెన్ టూర్ వెళ్తున్నట్టు సమంత పేర్కొంది.
మరోవైపు ఓ ఆసక్తికర సందేశాన్ని స్టోరీస్‌లో పేర్కొంది సమంత(Samantha Post). తన పెళ్లి బంధం బ్రేక్ అయిన నేపథ్యంలో అమ్మాయిల పెళ్లి, వారి పెంపకం గురించి పేర్కొంది సమంత. అమ్మాయిలను ఎలా పెంచాలో, వేటిక ప్రయారిటీ ఇవ్వాలో తెలియజేసింది. ఇందులో సమంత చెబుతూ, మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడకుండా ఉండేంత సమర్థురాలిగా చేయండి. ఆమె పెళ్లి రోజు కోసం డబ్బుని పొదుపు చేయకుండా, ఆమె చదువుకి ఖర్చు పెట్టండి` అని చెప్పింది.
ఇంకా చెబుతూ, `ముఖ్యంగా ఆమెని పెళ్లికి సిద్దం చేయడానికి బదులుగా తన కోసం తనని సిద్ధం చేయండి. ఆమెకి ఆత్మ విశ్వాసం, ధైర్యాన్ని నేర్పించండి. అవసరమైతే ఆమె ఎవరినైనా గొంతు పిసికేయగలదని కూడా బోధించండి` అని పేర్కొంది సమంత. మొత్తంగా అమ్మాయిలను ధైర్యవంతులుగా, సొంతంగా జీవించేలా పెంచాలని సూచిస్తుంది సమంత. తన జీవితంలో జరిగిన అనుభవాలను బేస్ చేసుకుని కూతుళ్లున్న తల్లిదండ్రులకు ఇలా హితబోధ చేస్తుంది.
Samantha
ప్రస్తుతం సమంత పంచుకున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగచైతన్యతో విడాకుల విషయంలో తనలో కలిగిన మానసిక సంఘర్షణకిది నిదర్శనమని అంటున్నారు నెటిజన్లు. సమంత అనుభవించిన బాధని మరెవరూ అనుభవించ కూడదని ఇలాంటి పోస్ట్ పెట్టిందని చెబుతున్నారు. దీనికి చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. సమంతకి మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె చెప్పింది నిజమని తెలియజేస్తున్నారు. అమ్మాయిలున్న పేరెంట్స్ లో మార్పు రావాలని కోరుతున్నారు.
సమంత.. నాగచైతన్య ఈ నెల 2న తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నామని, విడిపోయినా స్నేహంగానే ఉంటామన్నారు. తమ వ్యక్తిగత జీవితాలకు స్వేచ్ఛనివ్వాలని, దీనిపై ఎవరూ ఒత్తిడి చేయకూడదని తెలిపారు. అయితే తాను విడిపోవడానికి పలు యూట్యూబ్ చానెల్స్ రకరకాలు వార్తలను ప్రసారం చేయడంతో మండిపోయిన సమంత.. వాటిపై చర్యలు తీసుకోవాలని, కూకట్‌పల్లి కోర్ట్ ని ఆశ్రయించింది. దీంతో మంగళవారం ఈ కేసుని విచారించిన కోర్ట్ సమంతపై ప్రసారం చేసిన తప్పుడు కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది.
సమంత ఇకపై కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలు చేసేందుకు కమిట్ అవుతుంది. ఇప్పటికే ఆమె తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు కొత్తగా రెండు బైలింగ్వల్ ప్రాజెక్ట్ లను ప్రకటించింది. మరోవైపు హిందీలోకి డెబ్యూ ఇవ్వబోతుందట. అటీ-షారూఖ్‌ఖాన్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందని తెలుస్తుంది. నయనతార స్థానంలో సమంతని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.