Pawan Kalyan: నీకు దండం పెడతాం, ఆ డైరెక్టర్‌తో మాత్రం సినిమా వద్దు.. పవన్‌కి ఫ్యాన్స్ రిక్వెస్ట్

Published : Oct 15, 2025, 07:23 AM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నెక్ట్స్ సినిమాల లైనప్‌ పెరిగిపోతుంది. `ఓజీ` ప్రీక్వెల్‌, సీక్వెల్‌తోపాటు సురేందర్‌ రెడ్డి మూవీ చేయాలి. అలాగే దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఓ డిజాస్టర్‌ డైరెక్టర్‌ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. 

PREV
15
ఓజీతో బౌన్స్ బ్యాక్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ ఇటీవలే `ఓజీ` మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఆయనకు చాలా ఏళ్ల తర్వాత హిట్ పడింది. ఇంకా చెప్పాలంటే `అత్తారింటికి దారేదీ` తర్వాత ఆ స్థాయి హిట్‌ రాలేదు. `వకీల్‌ సాబ్‌`, `భీమ్లా నాయక్‌` ఫర్వాలేదనిపించినా, బ్లాక్‌ బస్టర్స్ గా నిలవలేకపోయాయి. చివరి రెండు సినిమాలు `బ్రో`, `హరి హర వీరమల్లు` బాగా డిజప్పాయింట్‌ చేశాయి. దీంతో దాదాపు 12ఏళ్ల అభిమానుల నిరీక్షణని `ఓజీ`తో తెరదించారు పవన్‌. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన `ఓజీ` మూవీ ఏ రేంజ్‌లో హిట్‌ అయ్యిందో తెలిసిందే. దాదాపు మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు పవన్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన మూవీగానూ నిలిచింది. ఇంకా ఇది థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నెల 23న ఓటీటీ(నెట్‌ ఫ్లిక్స్)లోకి రాబోతుంది.

25
పవన్‌ నెక్ట్స్ మూవీ సురేందర్‌ రెడ్డితో

ఈ క్రమంలో `ఓజీ` సక్సెస్‌ సెలబ్రేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. `ఓజీ` ఇచ్చిన సక్సెస్‌ జోష్‌తో `ఓజీ` యూనివర్స్ చేయడానికి రెడీ అని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ అంతా హ్యాపీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్ లు తెరపైకి వచ్చాయి. పవన్‌ `ఓజీ`నే కాదు ఇతర సినిమాలు కూడా చేసేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. పవన్‌ గతంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనికి రామ్‌ తాల్లూరి నిర్మాత. ఒకవేళ పవన్‌ నెక్ట్స్ మూవీ చేస్తే ఈ ప్రాజెక్ట్ మొదటగా ఉంటుందట. ఆ తర్వాతనే `ఓజీ` ప్రీక్వెల్‌, సీక్వెల్‌ ఉంటాయని టాక్‌. అంతేకాదు ఇప్పుడు కొత్తగా మరో రెండు సినిమాలు తెరపైకి వచ్చాయి.

35
పవన్‌తో సినిమాకి దిల్‌ రాజు గట్టి ప్లాన్‌

పవన్‌ కళ్యాణ్‌ తో నిర్మాత దిల్‌ రాజు సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఎంటర్టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నారు.  అనిల్‌ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌, పవన్‌ మార్క్ సందేశం మేళవింపుతో దీన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. పవన్‌ని ఒప్పించేందుకు దిల్ రాజు, అనిల్‌ రావిపూడి గట్టిగా ట్రై చేస్తున్నారట. మరి పవన్‌ ఒప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇది మాత్రం సోషల్‌ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతుంది. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన సినిమాలు చేసేందుకు టైమ్‌ పాజిబులిటీ ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న.  ఇంతకు ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికే ఏళ్లు పట్టాయి. వాటిని కూడా డూప్‌లతోనే ఎక్కువగా నడిపించారు. ఇలాంటి సమయంలో కొత్త సినిమాల విషయంలో పవన్‌ అంత రిస్క్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

45
పవన్‌తో మూవీకి మెహర్‌ రమేష్‌ ప్లాన్‌

ఇదిలా ఉంటే ఈ సినిమాలే కాదు ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడి పేరు  తెరపైకి వచ్చింది. వరుసగా ఫ్లాప్‌ సినిమాలు తీస్తూ వస్తోన్న మెహర్‌ రమేష్‌ సైతం పవన్‌తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఆయనతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సారి హిట్‌ కొట్టాలనే లక్ష్యంతో మెహర్‌ పావులు కదుపుతున్నారట. పవన్‌ ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని, తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారట. ఓ డిఫరెంట్‌ కథతో పవన్‌ని అప్రోచ్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. `హరి హర వీరమల్లు` సినిమా నుంచి మెహర్‌ రమేష్‌.. పవన్‌ని తరచూ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మెహర్‌ చివరగా చిరంజీవితో `భోళా శంకర్‌`  వంటి డిజాస్టర్‌ తీసిన విషయం తెలిసిందే.

55
నీకు దండం ఆయనతో సినిమా వద్దు.. ఫ్యాన్స్ ఆందోళన

ఈ విషయం తెలిసి పవన్‌ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఓజీ ఇచ్చిన సంతోషం లేకుండా చేస్తున్నారని అంటున్నారు. అయ్యా నీకు దండం పెడతాం, ఆయనతో మాత్రం సినిమా వద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. వద్దు బాబు వద్దు నీకో సమస్కారం అంటున్నారు. రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ ఏమైనా చేస్తున్నారా అని, వామ్మో అజ్ఞాతవాసానికి పంపాలని గట్టిగా నిర్ణయించుకున్నారా ఏంటి? అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్‌తో మెహర్‌ రమేష్‌ అనే వార్తతోనే ఫ్యాన్స్ అంతా టెన్షన్‌ పడుతుండటం గమనార్హం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌ ఆ రిస్క్ చేస్తాడా? అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories