
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ `డీజే టిల్లు`, `టిల్లు స్వ్కేర్` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ ఆకట్టుకున్నాడు. హిట్లు కొట్టాడు. ఇందులో తన డైలాగ్ కామెడీతో నవ్వించాడు. ఆయన కామెడీ ప్రభావం ఆడియెన్స్ పై గట్టిగా పడింది. దీంతో ఆయన్ని టిల్లు ఇమేజ్‌ని దాటి చూడలేకపోతున్నారు ఆడియెన్స్. దాని ఫలితమే`జాక్` డిజాస్టర్. ఆ దెబ్బతో తన పారితోషికం కూడా వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందట. దీంతో ఇప్పుడు మళ్లీ ట్రాక్ మార్చాడు సిద్ధు. తన స్టయిల్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన `తెలుసు కదా` చిత్రంలో నటిస్తున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ దీపావళి స్పెషల్‌గా ఈ నెల 17న విడుదల కానుంది.
సోమవారం `తెలుసు కదా` మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో `టిల్లు` స్టయిల్ కామెడీ, డైలాగ్స్ కనిపించాయి. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ ఇన్ వాల్వ్ మెంట్ ఎంతో ఉందని దర్శకురాలు తెలిపింది. అనుభవం ఉన్నవారిని వాడుకోకపోతే మన తప్పే అవుతుందని తెలిపింది. అటు సిద్ధు కూడా చాలా ఇన్ వాల్వ్ అయినట్టు, ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో భాగమైనట్టు తెలిపాడు. ట్రైలర్ కూడా `టిల్లు` ఛాయల్లోనే సాగింది. డైలాగ్‌లు, రొమాంటిక్ సీన్లు అలానే ఉన్నాయి. ట్రైలర్ చివర్లో అలాంటి ఒక బోల్డ్ సీన్ ఉంది. అయితే తాజాగా దీనిపై స్పందించారు సిద్ధు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ సీన్ సినిమాలో ఉండబోదని తెలిపారు. ట్రైలర్ ఈవెంట్‌లోనే దీనిపై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అందుకే ఆ సీన్‌ని తొలగించినట్టు తెలిపారు.
`తెలుసు కదా` ట్రైలర్ లో ఉన్న కంటెంట్ సినిమాలో లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై సిద్ధు రియాక్ట్ అయ్యారు. ట్రైలర్‌లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే `టిల్లు` స్టయిల్‌లోనే ఈ మూవీ ఉందనే ప్రశ్నకి ఆయన రియాక్ట్ అవుతూ, అలా ఉండదని, అందులోని పాత్రకి, దీనికి చాలా డిఫరెంట్స్ ఉంటుందన్నారు. ఇందులో ఎక్స్ ట్రీమ్‌లో హీరో రోల్ ఉంటుందని, రిలేషన్ అయినా, ఏదైనా సీరియస్‌గా ఉంటుందని చెప్పారు. ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందని, చాలా ఎమోషన్స్ ఉంటాయని తెలిపారు. ఆయన ఎంత చేసినా ట్రైలర్ మాత్రం అలానే ఉండటంతో చాలా వరకు సిద్ధు మళ్లీ `టిల్లు` ట్రాక్‌లోకి వెళ్లాడని అంటున్నారు.
అయితే ఎమోషనల్‌గా ఉంటుందని, రిలేషన్స్ గురించి కొన్ని విషయాలు బలంగా చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సిద్ధు చెబుతూ, `ఇందులో లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్ ఫ్యామిలీ రిలేషన్ షిప్ గురించి డిస్కషన్ ఉంటుంది. కానీ ప్రతి సీను చాలా కొత్తగా ఉంటుంది. నీరజ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో వచ్చారు. రాశి, శ్రీనిధి క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. వాళ్ళకి మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. కచ్చితంగా ఆడియన్స్ ని షాక్ చేస్తుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి హ్యుమర్ కూడా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అద్భుతమైన బజ్ వచ్చింది. మేమేదైతే చూసి ఎగ్జైట్ అయ్యామో ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతారు` అని తెలిపారు సిద్ధు. `జాక్` సమయంలో దర్శకుడు కొరటాల శివ చెప్పిన విషయాన్ని వెల్లడిస్తూ `టిల్లుతో ఆల్ టైమ్ హై చూశావు, `జాక్` తో లో చూశావు.. ఇక నువ్వు ఏం చేసినా ఆ రెండిటి మధ్య చూస్తావు' అన్నారు. ఈ మాట ఇకపై ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకేలా చూడాలనే ఆలోచన కలిగించింది` అని చెప్పాడు సిద్ధు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.