ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ బడ్జెట్.. బాబోయ్ పెద్ద ప్లానే వేస్తున్నారుగా.. 

First Published | Aug 19, 2024, 4:11 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. దేవర వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ జాతరకు సిద్ధం అవుతున్నారు. అదే విధంగా హృతిక్ రోషన్ తో కలసి వార్ 2లో నటిస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. దేవర వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ జాతరకు సిద్ధం అవుతున్నారు. అదే విధంగా హృతిక్ రోషన్ తో కలసి వార్ 2లో నటిస్తున్నాడు. ఇంతలో ప్రశాంత్ నీల్ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ ఇటీవల ప్రారంభించాడు. 

ఇది ప్రశాంత్ నీల్ కి డ్రీం ప్రాజెక్టు అని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించేందుకు రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ని బట్టి ప్రాధమికంగా ఈ చిత్రానికి 350 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని నిర్మాతలకు తెలిపారట. 


ఎంత బడ్జెట్ అయినా వెనకాడకుండా నిర్మించేందుకు మైత్రి నిర్మాతలు సిద్ధం అయ్యారు. అంటే ఈ చిత్రం పూర్తయే సరికి 400 నుంచి 450 కోట్లకి బడ్జెట్ చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కెరీర్ లో ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. 

దేవర రెండు భాగాలకు కలిపి 300 కోట్ల బడ్జెట్ అవుతోంది. కానీ ప్రశాంత్ నీల్ ఒక్క చిత్రాన్ని 350 కోట్ల బడ్జెట్ లో తెరెకెక్కించబోతున్నారు. కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ బావుంది కానీ ప్రశాంత్ నీల్ సత్తాని పూర్తిగా చూపించలేకపోయింది. దీనితో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం కనీవినీ ఎరుగని సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. 

Latest Videos

click me!