Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..

Published : Sep 12, 2026, 12:10 PM IST

మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో అందరికి ఓ గౌరవం, చిన్న ఆర్టిస్ట్ లలో భయం, అభిమానుల్లో భక్తి ఉంటుంది. ఆయన ఎదురుగా ఉండి సమాధానం చెప్పడానికి చాలామంది భయపడుతుంటారు. కానీ ఓ ఆర్టిస్ట్ మాత్రం ఏమాత్రం సంకోచించకుండా.. తనకు కంఫర్ట్ లేదని చెప్పాడట.

PREV
15
టాలీవుడ్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి..

చిరంజీవి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సాధించిన హీరో. వారసత్వంగా వచ్చిన పెద్ద పెద్ద హీరోలను కూడా వెనక్కి నెట్టి.. టాలీవుడ్ పై పట్టు సాధించాడు చిరు. మెగాస్టార్ గా ఎదిగి.. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా ఉన్నాడు. టాలీవుడ్ కు ఎటువంటి కష్టం వచ్చినా.. నేనున్నా అంటూ.. ముందుకు వస్తుంటాడు. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో మాట్లాడటం అంటే పెద్ద పెద్ద నటులే భయపడుతుంటారు. అటువంటిది.. కొత్తగా వచ్చిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం.. తనకు కంఫర్ట్ లేదంటూ.. మెగాస్టార్ ముఖం మీదే చెప్పాడట. ఆ మాట వినగానే సెట్ లో అంతా షాక్ అయ్యారట. అప్పుడు చిరంజీవి ఏం చేశాడో తెలుసా? ఇదంతా ఠాగూర్ సినిమా షూటింగ్ టైమ్ లో జరిగింది. ఆ ఆర్టిస్ట్ ఎవరో కాదు షాయాజీ షిండే.

25
ఠాగూర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనస్సులలో చెరగని ముద్ర వేసిన నటుడు షాయాజీ షిండే. ఆయన తెలుగు చిత్రసీమకు పరిచయమైంది ‘ఠాగూర్’ సినిమాతోనే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాను వి. వి. వినాయక్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది. ఈ విజయం వెనుక ఉన్న ఆసక్తికరమైన షూటింగ్ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో షాయాజీ షిండే పంచుకున్నారు.చిరంజీవితో మొదటి పరిచయం, ఆయనతో ఏం మాట్లాడారు అనే విషయాలను షాయాజీ ఇంటర్వ్యూలో వివరంగా వెల్లడించారు.

35
చిరంజీవి ముఖం మీద చెప్పేసిన షాయాజీ షిండే

షాయాజీ షిండే హిందీ చిత్రం ‘కోల్‌కతా మెయిల్’ లో నటిస్తున్న సమయంలో, నిర్మాత అల్లు అరవింద్ , సి. అశ్విని దత్ ఆయన నటనను చూసి ‘ఠాగూర్’ చిత్రంలోని మెయిన్ విలన్ పాత్రకు ఎంపిక చేశారు. షూటింగ్ మొదటి రోజునే మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆప్యాయంగా షాయాజీ వద్దకు వచ్చి “మీకు ఇక్కడ పని చేయడం కంఫర్టబుల్‌గా ఉందా?” అని అడిగారట. దానికి షాయాజీ షిండే ఏమాత్రం సంకోచించకుండా “నాకు కంఫర్టబుల్‌గా లేదు” అని సూటిగా చెప్పారు. ఈ సమాధానం విన్న చిత్రయూనిట్ ఆశ్చర్యపోయినప్పటికీ, చిరంజీవి గారు ఎంతో ఓపికగా దానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు.

45
సమస్య ఏంటో వివరించిన షిండే..

నాటకరంగ అనుభవం - భాష సమస్య తన అసౌకర్యానికి కారణాన్ని వివరిస్తూ, తాను 17 ఏళ్లపాటు థియేటర్ (నాటకాల) రంగంలో నటుడిగా అనుభవం ఉన్నవాడినని షాయాజీ చెప్పారు. నాటకరంగంలో ముఖ కవళికల కంటే 'వాయిస్ ఎక్స్‌ప్రెషన్' (స్వరం ద్వారా భావప్రకటన) స్పష్టమైన పదాల ఉచ్ఛారణ చాలా ముఖ్యమని, తెలుగు భాష కొత్త కావడం వల్ల డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోతున్నానని వివరించారు. ప్రాంప్టింగ్ ద్వారా డైలాగులు చెబితే యాక్టింగ్ లో సోల్ లోపిస్తుందని, దాంతో శ్రద్ధ దెబ్బతింటుందని చిరంజీవితో ఆయన స్పష్టం చేశారు.

55
చిరంజీవి ఏం చేశాడో తెలుసా?

షాయాజీ షిండే మాటలను ఓపికగా విన్న చిరంజీవి ఆయనలోని నటుడిని, కళ పట్ల ఆయనకున్న నిబద్ధతను ఎంతో గౌరవించారు. వెంటనే దర్శకుడు వి. వి. వినాయక్‌తో మాట్లాడి, ప్రతిరోజూ మరుసటి రోజు తీయబోయే సన్నివేశాలకు సంబంధించిన డైలాగ్స్‌ను ముందే అందించేందుకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను షాయాజీ ఉంటున్న హోటల్‌కు పంపే ఏర్పాటు చేశారు. ఈ సహకారంతో షాయాజీ షిండే తెలుగు పదాల అర్థాలను తెలుసుకుంటూ, ఒక్కో డైలాగ్‌ను మూడు నాలుగు సార్లు రాసుకుంటూ, వాటిని వేర్వేరు సౌండింగ్స్ లో (Fast, Medium, Low Speed) రికార్డ్ చేసుకుని సాధన చేసేవారు. ఇలా కష్టపడి ఆ సీన్లను బైహార్ట్ చేసి.. పక్కాగా ఎమోషన్స్ పలికేలా నటించేవారు. భాష రాకపోయినా.. సొంత డబ్బింగ్ కు ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు.

సాధారణంగా ఇతర భాషా నటులకు వేరే డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించడం సహజం. కానీ ఒక నటుడి స్వరం అనేది ఆ పాత్ర యొక్క 'ఆత్మ' అని నమ్మిన షాయాజీ, ఠాగూర్ సినిమాకు తన సొంత స్వరంతోనే డబ్బింగ్ చెప్పారు. ఒక సన్నివేశానికి ఒకటి రెండు రోజుల సమయం తీసుకుని, ఎంతో కష్టపడి స్వయంగా డబ్బింగ్ పూర్తి చేశారు.మెగాస్టార్ చిరంజీవి చూపించిన చొరవ, సహకారం, ప్రోత్సాహం వల్లే ‘ఠాగూర్’ చిత్రంలో భద్రం పాత్ర అంత సక్సెస్ అయ్యిందని... తెలుగు ప్రేక్షకులకు తన నటన అంతగా దగ్గరైందని షాయాజీ షిండే కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories