Chiranjeevi: ఒకవైపు తమ్ముడు, మరోవైపు కొడుకు.. అస్సలు కుదరదు అని బాంబు పేల్చిన చిరంజీవి

Published : Jan 10, 2026, 11:24 AM IST

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్, కొడుకు రాంచరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులకు నిరాశ కలిగేలా చిరంజీవి కామెంట్స్ చేశారు. 

PREV
15
సంక్రాంతికి చిరంజీవి సినిమా

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ మూవీ రిలీజ్ ఉండడంతో చిరంజీవికి సంబంధించిన పాత విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

25
మన శంకర వరప్రసాద్ గారులో వెంకీ 

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనితో మరోసారి మల్టీస్టారర్ సినిమాల గురించి చర్చ మొదలైంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ తమ ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు, పవన్ కళ్యాణ్, రాంచరణ్ కలిసి నటించే అవకాశం లేదా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా చిరంజీవి సమాధానం మెగా అభిమానులకు షాకింగ్ గా మారింది. 

35
మా ముగ్గురి కాంబోలో సినిమా సాధ్యం కాదు 

మా ముగ్గురు కాంబినేషన్ లో సినిమా రావాలి అంటే ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. చాలా కష్టం అవుతుంది. ఒకవేళ నిజంగా అది సాధ్యం అయితే మాత్రం అభిమానులకు ఐఫీస్ట్ లాగా ఉంటుంది. కానీ మా ముగ్గురికి సరిపడే కథ తయారు చేయడం, బడ్జెట్ మ్యానేజ్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి మా ముగ్గురి కాంబోలో సినిమా సాధ్యం కాకపోవచ్చు అని చిరంజీవి అన్నారు. 

45
అభిమానులకు పండగే 

బడ్జెట్ గురించి పట్టించుకోకుండా చేస్తే మాత్రం అభిమానులకు పండగే అని చిరంజీవి తెలిపారు. అక్కినేని ఫ్యామిలీలో ఆల్రెడీ మల్టీస్టారర్ మూవీ వచ్చింది. మనం చిత్రం ఘనవిజయం సాధించింది. 

55
మెగా హీరోల సినిమాలు 

మెగా ఫ్యామిలీ నుంచి కూడా లాంటి సినిమా రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ చిరంజీవి కామెంట్స్ మాత్రం షాకింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తుండగా.. రాంచరణ్ పెద్ది చిత్రంలో.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories