Raja Saab Day 1 Collections: ది రాజా సాబ్‌ మొదటి రోజు బాక్సాఫీసు వసూళ్లు.. ప్రభాస్‌ సినిమాకి ఊహించని కలెక్షన్లు

Published : Jan 10, 2026, 10:52 AM IST

ప్రభాస్‌ హీరోగా నటించిన `ది రాజా సాబ్‌` మూవీ శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. మరి మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే? 

PREV
16
హర్రర్‌ కామెడీగా వచ్చిన `ది రాజాసాబ్‌`

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ ఫిల్మ్ `ది రాజా సాబ్‌` పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్ర పోషించగా, ప్రభాస్‌ శ్రీను, వీటీవీ గణేష్‌, సప్తగిరి, సముద్రఖని, జరీనా వాహబ్‌ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఫాంటసీ, హర్రర్‌ కామెడీ, సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

26
ది రాజా సాబ్‌కి మిశ్రమ స్పందన

శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. ప్రభాస్‌ పాత్రని బాగా చూపించాల్సింది అని, కామెడీ ఆశించిన స్థాయిలో లేదు అని, స్లోగా ఉందని, ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా హీరోని పెట్టుకుని ఇలాంటి కామెడీ సినిమా చేస్తారా? అంటూ ఆడియెన్స్ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో కామెడీ, హర్రర్ ఎలిమెంట్లు, సైకలాజికల్‌ థ్రిల్లర్ ఎలిమెంట్లు ఆకట్టుకున్నాయని, కొత్తగా ఉన్నాయని, పండక్కి చూడదగ్గ మూవీ అంటున్నారు.

36
ది రాజా సాబ్‌ మొదటి రోజు కలెక్షన్లు

ఈ నేపథ్యంలో ఇప్పుడు `ది రాజా సాబ్‌` మూవీకి ఫస్ట్ డే ఎంత కలెక్షన్లు వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ప్రముఖ ట్రేడ్‌ సైట్‌ సాక్నిక్‌  ప్రభాస్ మూవీ మొదటి రోజు కలెక్షన్ల వివరాలను ప్రకటించింది. ఈ మూవీకి ఊహించినట్టుగానే కలెక్షన్లని సాధించింది. తొలి రోజు ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.101కోట్లని వసూలు చేసింది. ఇది ఇండియాలో రూ.75కోట్లు, ఓవర్సీస్‌లో రూ.26కోట్లు రాబట్టింది. ఇండియా నెట్‌ వసూళ్లు రూ.63కోట్లు కావడం విశేషం.

46
ది రాజా సాబ్‌ స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు

ఇక స్టేట్‌ వైడ్‌గా వసూళ్లని చూస్తే, ఇది ప్రీమియర్స్ తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.57కోట్లు, తమిళనాడులో కోటిన్నర, కర్నాటకలో ఎనిమిది కోట్లు, కేరళాలో రూ.15లక్షలు, నార్త్ లో ఏడున్నర కోట్లు వసూలు చేసింది. ప్రీమియర్స్ విఫయంలో తెలంగాణలో గట్టి దెబ్బ పడింది. దాదాపు ఐదారు కోట్లని నష్టపోవాల్సి వచ్చింది.

56
ది రాజా సాబ్‌ ఊహించని కలెక్షన్లు

అయితే కలెక్షన్లు మాత్రం ఊహించినట్టే వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. వందకోట్లు కూడా దాటడం కష్టమే అనే అభిప్రాయం వచ్చింది. కానీ డీసెంట్‌గానే మొదటి రోజు రాబట్టడం విశేషం. ఈ సినిమాకి ఇంకా రెండు రోజులు ఉంది. శనివారం, ఆదివారం మంచి నెంబర్స్ వస్తే సినిమాకి ప్లస్‌ అవుతుంది, లేదంటే పరాజయం తప్పదు. మరి ఎలా ఉంటాయో చూడాలి.

66
ది రాజా సాబ్‌ బాక్సాఫీసు టార్గెట్‌

`ది రాజా సాబ్‌` మూవీకి ఓవరాల్‌గా సుమారు రూ.400కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. సినిమా డిలే కారణంగా ఈ బడ్జెట్‌ పెరిగిందట. అయితే సినిమాని చాలా వరకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంత రిలీజ్‌కి వెళ్తోంది. ఓవర్సీస్‌లో రూ.80కోట్ల వ్యాపారం జరిగిందని, ఓటీటీ రూపంలోనూ గట్టిగానే వచ్చిందని సమాచారం. బడ్జెట్‌పరంగా ఈ మూవీ ఆరువంద కోట్లకుపైగా గ్రాస్‌ వస్తేనే నిర్మాత సేఫ్‌ లేదంటే దారుణంగా నష్టపోవాల్సి వస్తుందని టాక్‌.  నిర్మాత భవిష్యత్‌ ఈ మూవీ కలెక్షన్లపై ఆధారపడి ఉందని చెప్పొచ్చు. మరి నిర్మాతని ముంచుతుందో, లేపుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories