ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో చిరంజీవి రొమాన్స్, కెరీర్ లో రేర్ రికార్డ్.. అందరితో బ్లాక్ బస్టర్ హిట్లు

Published : Jun 05, 2025, 08:35 AM IST

ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో చిరంజీవి నటించి అందరితో సూపర్ హిట్స్ కొట్టారు. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరు, ఆ చిత్రాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
చిరంజీవితో నటించిన క్రేజీ హీరోయిన్లు

45 ఏళ్ళ సినీ కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి సాధించని రికార్డు అంటూ లేదు. మెగాస్టార్ గా శిఖరాగ్రానికి ఎదిగిన చిరంజీవి నటన, డాన్సులు, ఫైట్లతో అభిమానులని అలరించారు. 150 పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడారు. చిరంజీవి కెరీర్లో రాధా, రాధిక, విజయశాంతి లాంటి హీరోయిన్లు కీలకమైన వారుగా చెప్పుకోవచ్చు. అయితే హీరోయిన్ల విషయంలో చిరంజీవికి ఒక అరుదైన రికార్డు ఉంది.

25
ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో రొమాన్స్

ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి నటించి సూపర్ హిట్లు కొట్టడం మరో విశేషం. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరంటే నగ్మా, జ్యోతిక, రోషిని. వీళ్ళు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు.

35
ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్

చిరంజీవితో నగ్మా.. ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల్లో నటించింది. వీటిలో ఘరానా మొగుడు చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులో 10 కోట్ల షేర్ వసూలు చేసిన తొలి చిత్రంగా ఘరానా మొగుడు చిత్రం రికార్డ్ సృష్టించింది. ఈ మూవీలో చిరంజీవి, నగ్మా కెమిస్ట్రీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

45
ఆమె కూడా నగ్మా చెల్లెలే..

నగ్మా చెల్లెలు జ్యోతికతో చిరంజీవి ఠాగూర్ చిత్రంలో నటించారు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నగ్మా మరో సోదరి రోషినితో కూడా చిరంజీవి నటించారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం మాస్టర్. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది.

55
రోషిని నటించిన చిత్రాలు

నగ్మా, జ్యోతిక ఇద్దరూ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. వారి సోదరి రోషిని మాత్రం ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేదు.మాస్టర్ మూవీ తర్వాత రోషిని తెలుగులో పవిత్ర ప్రేమ, శుభలేఖలు చిత్రాల్లో నటించింది.

Read more Photos on
click me!

Recommended Stories