మెగాస్టార్ హనుమంతుడి భక్తుడు ఎలా అయ్యాడు?.. ఫస్ట్ టైమ్‌ బయటపెట్టిన చిరంజీవి.. తండ్రికే గురవై.. కథ పెద్దదే

First Published Jan 8, 2024, 12:25 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి హనుమంతుడికి వీరభక్తుడు. మరి ఆయన ఆంజనేయుడికి ఎలా భక్తుడయ్యాడు. ఇన్నాళ్లకి ఫస్ట్ టైమ్‌ బయటపెట్టాడు చిరంజీవి. అసలు కథ చెప్పాడు.

మెగాస్టార్ చిరంజీవి.. హనుమంతుడి భక్తుడు అనే విషయం తెలిసిందే. ఆంజనేయుడుపై భక్తిని ఆయన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలియజేస్తుంటారు. తాను నిర్మించిన కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌ లోగోలోనూ హనుమంతుడి రూపాన్ని డిజైన్‌ చేయించారు. ఇంట్లో గుడి కూడా కట్టుకున్నాడు చిరంజీవి. అయితే తాను ఇప్పుడుఈ స్థాయికి కారణం ఆంజనేయస్వామీనే అని చిరంజీవి చెబుతున్నారు. మరోసారి స్పష్టం చేశాడు. తన ఆరాధ్య దైవం హనుమంతుడి గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పే సందర్భం రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. దీంతో ఆ విషయాలను బయటపెట్టాడు చిరు.  
 

`హనుమాన్‌` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్లిన ఆయన తాను ఎందుకు హనుమంతుడికి భక్తుడిని అయ్యానో వివరించారు చిరంజీవి. దీనికి సంబంధించిన బిహైండ్‌ కథ చెప్పాడు. తాను ఇంతటి స్థాయికి రావడానికి ఆయనే కారణమని, తనలోని ఈ క్రమశిక్షణకు, కష్టపడేతత్వానికి హనుమంతుడే కారణమని చెప్పాడు చిరు. ఆయనపై ప్రేమ, భక్తినే తనని నడిపిస్తుందని, ఓ రకంగా తన కుల ధైవంగా మారిందని చెప్పారు. హిందుత్వంగురించో, మరో మతం గురించో అనేది ఇక్కడ మ్యాటర్‌ కాదని, ఒక ఇన్‌ స్పైరింగ్‌ పర్సనాలిటీ అని, మనం పైకి రావడానికి, మనం ఆయనకు సరెండర్ అయిపోతే మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడనే దానికి తానే ఉదాహరణ అని, ఆయన్ని తీసుకోవడం వల్లే ఈ స్థానంలో ఉన్నట్టుగా నమ్ముతున్నట్టు చెప్పారు చిరు. 
 

Latest Videos


తాను ఈ విషయాన్ని మనసు అంతరాంతరాల్లోనుంచి వెళుబుచ్చుతున్నట్టు తెలిపారు చిరంజీవి. చిన్నప్పుడు వారింట్లో ఎవరూ ధైవ భక్తులు లేరట. నాన్న కమ్యూనిస్ట్ అట. అసలు దేవుడే నమ్మేవాడు కాదట. అమ్మ ఒత్తిడి మేరకు ఎప్పుడో ఒకసారి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే వాళ్లమని తెలిపారు చిరు. పొన్నూరులో తాను ఏడో తరగతి చదువుకునే సమయంలో అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉండేదట. రోజూ దెండం పెట్టుకుని వచ్చేవాడట. ఆ నెక్ట్స్ ఇయర్‌ 8వ తరగతి బాపట్లలో చదువుకున్నాడట. అక్కడ కూడా ఆంజనేయుడి గుడి ఉండేదట. సాయంత్రంట్యూషన్‌ వెళ్లి వచ్చే సమయంలో ఆ గుడి వద్ద ప్రసాదం ఇచ్చేవారట. ఆ ప్రసాదం కోసం అక్కడికి వెళ్లేవాడట చిరు. అలా ప్రసాదం ద్వారా ఆంజనేయుడిపై భక్తి ఏర్పడిందన్నారు. 
 

ఆ గుడి వద్ద ప్రసాదం తింటూ, పూజారి చెప్పే విషయాలు వింటూ హనుమాన్‌ ఛాలిసా చదివేవాడట. అలా తెలియకుండా ఆంజనేయుడిపై భక్తి భావం తనలో ఏర్పడిందన్నారు. ఇక మొగల్తూరులో చదువుకునే సమయంలో అక్కడ రోడ్డుపై మిఠాయి కొంటే హనుమంతుడు ఉన్న క్యాలెండర్‌ వచ్చిందట. ఉదరం చీల్చుకుని ఉన్న హనుమంతుడి క్యాలెండర్‌ అని, ఆ బొమ్మని ఇప్పటికీ తన ఇంట్లో ఉందని, దాన్ని ఎన్నో ఏళ్లుగా పూజిస్తున్నట్టు తెలిపారు చిరంజీవి. అప్పట్నుంచి ఆయన వెంట నేను పడ్డానా, నా వెంట ఆయన పడ్డాడో తెలియదు గానీ, ఇప్పటికీ తనలో హనుమంతుడు అంతర్భాగమైపోయాడని తెలిపారు.
 

ఆ తర్వాత తాను టెంన్త్ చదివే సమయంలో పేరాల చీరాలలో చిరంజీవి తండ్రి పనిచేసేవాడట.ఆతర్వాత దూరంగా ఉద్యోగం ట్రాన్స్ఫర్‌ అయ్యింది. అక్కడికి పోవడం ఇష్టం లేక లాంగ్‌ లీవ్ పెట్టాడట.ఆ సమయంలో ఆయన ఒత్తిడికి గురవుతుంటే, హనుమాన్‌ ఛాలిసా చదవమని సలహా ఇచ్చాడట చిరు. ముందు సంకోచించినా, ఆ తర్వాత అవుతుందంటావా అని చదివాడట. అంతే ఆ వెంటనే తన ఉన్న ఊరికే జాబ్‌ ట్రాన్స్ ఫర్‌ అయ్యిందట. ఆ సమయంలో దేవుడిపై తండ్రికి నమ్మకం కుదిరిందని, తనకి గురువు ఎవరో కాదు, హనుమంతుడిని పరిచయంచేసిన గురువు నువ్వే అని అంటుంటే చాలా గర్వంగా ఉంటుందన్నారు చిరు. 

పేరాలలో డిగ్రీ చేసిన చిరు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాలని, చెన్నై వెళ్లిపోవాలనుకుంటున్నాడు. ఆ సమయంలో పెరట్లో ఆంజనేయ స్వామి బొమ్మ దొరికిందట. దాన్ని నాన్న మెడలో లాకెట్‌ చేసి ఇచ్చాడట. అది మెడలో వేసుకుని చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ లో చేరినట్టు, ఆ తర్వాత తనకు అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయని తెలిపారు. అలా 1977-78 నుంచి ఆఫర్లువచ్చాయని, ఎక్కడా ఆగలేదని తెలిపారు. దీనంతటికి స్వామి మహిమే కారణమని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఎప్పుడూ స్వామితో మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు. ఓ సారి చెన్నైలో డబ్బింగ్‌ స్టూడియోలో ఆ లాకెట్‌ మిస్‌ అయ్యిందట. దీంతో చాలా కంగారు పడ్డాడట. రెండు రోజుల తర్వాత మళ్లీ ఆ స్టూడియోకే వెళితే అక్కడే ఆ బొమ్మ ఉందట. దాన్ని మరింత భద్రంగా ఉంచుకున్నాడట.
 

ఈ సందర్భంగా `అన్నయ్య`సినిమా షూటింగ్‌ జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఎప్పుడూ ఆ లాకెట్ని తీసే వాడిని కాదని తెలిపిన చిరు,ప్రారంభంలో తన సినిమాల్లో మెడలో ఆ లాకెట్ కనిపిస్తుందన్నారు. అయితే `అన్నయ్య`సినిమా షూటింగ్‌లో ఆ లాకెట్ తీసేయాల్సి వచ్చిందట. పక్కనే ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చానని, కానీ ఆ తర్వాత అతను ఇవ్వలేదు.ఎంత వెతికినా దొరకలేదు. దీంతో అప్పుడు అనిపించింది. దేవుడిపై భక్తి మనసులో ఉండాలి, గొలుసులో కాదు, ఆ విషయం తెలియడానికి తనకు ఇంత టైమ్‌ పట్టిందని భావించాడట. అప్పట్నుంచి ఏ కష్టం వచ్చిన, సమస్య వచ్చిన రాత్రి హనుమంతుడితో మనసులోనే మాట్లాడతానని,మార్నింగ్‌కి పరిష్కారం దొరుకుతుందన్నారు చిరు. ఇప్పటి వరకు తన జీవితం ఇంత సక్సెస్‌ఫుల్‌గా వెళ్లడానికి ఆ హనుమంతుడే కారణం అని తెలిపారు చిరు. 
 

click me!