వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు సృష్టించిన మనోరమా, తమిళంలో 800కు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. 2013లో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రెండేళ్లు ఆసుపత్రిలోనే గడిపారు.
2015 అక్టోబర్ 10న 78 ఏళ్ల వయసులో మరణించారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత "నా అక్క ఈ రోజు మరణించారు. నన్ను అమ్ము అని పిలిచే కొద్ది మందిలో ఆమె ఒకరు. శివాజీ గణేశన్ నటతారకం అయితే, సావిత్రి తర్వాత నటిగా మనోరమే నటతారకం" అని కొనియాడారు.