చిరంజీవితో రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బావున్నారా, స్టాలిన్ చిత్రాలని నాగబాబు నిర్మించారు. బావగారు బావున్నారా తప్ప మిగిలిన చిత్రాలు ఫ్లాప్ కానీ యావరేజ్ కానీ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్, రాంచరణ్ తో ఆరెంజ్ చిత్రాలని నాగబాబు నిర్మించారు. ఎన్ని ఫ్లాపులు ఎదురైనా తట్టుకోగలిగిన నాగబాబు ఆరెంజ్ మూవీ దెబ్బకి మాత్రం కుదేలైపోయారు. 30 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో నాగబాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.