వెంకటేష్ 75 వ చిత్రం కావడంతో సెలబ్రేటింగ్ వెంకీ 75 పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్ర రావు, మెగాస్టార్ చిరంజీవి లాంటి అతిరథ మహారథులు హాజరైన సంగతి తెలిసిందే. చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో చిరు, వెంకీ మధ్య బాండింగ్ మరోసారి బయట పడింది.