ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో మహేష్‌ బాబు న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌.. సితార, గౌతమ్‌ ల రచ్చ చూడాలి..

Published : Jan 01, 2024, 08:18 AM ISTUpdated : Jan 01, 2024, 08:53 AM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కొత్త ఏడాదిని దుబాయ్‌లో ప్లాన్‌ చేశాడు. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి అక్కడ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.   

PREV
18
ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో మహేష్‌ బాబు న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌.. సితార, గౌతమ్‌ ల రచ్చ చూడాలి..

మహేష్‌బాబు, తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల దుబాయ్‌కి వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. భార్య నమ్రత, కొడుకు గౌతమ్‌, కూతురు సితారలతో కలిసి ఆయన న్యూ ఇయర్‌ వెకేషన్‌కి వెళ్లారు. కొత్త ఏడాదిని దుబాయ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.  

28

సెలబ్రిటీలు లోకల్‌గా ఎంజాయ్‌ చేయలేరు. అందుకే ఇలా విదేశాల్లోకి వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. తమకు నచ్చినట్టుగా ఉంటారు. అందులో భాగంగానే మహేష్‌బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. షార్ట్ వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. 

38

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది నమ్రత. తన సంతోషాన్ని వెళ్లడించింది. పాత ఏడాది గుర్తులతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మహేష్‌బాబు, నమ్రత, గౌతమ్‌, సితారలతోపాటు నిర్మాత నవీన్‌ ఎర్నేని, వారి ఫ్రెండ్స్ ఉన్నారు. 
 

48

మరోవైపు సితార సైతం తన వెకేషన్‌ ఫోటోలను వీడియో రూపంలో షేర్‌ చేసుకుంది. ఇందులో నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. సితార, గౌతమ్‌ల ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. చిన్న పిల్లలుగా మారి వారితోపాటు మహేష్‌ కూడా రిలాక్స్ అవుతున్నారు. రెట్టింపు ఎనర్జీని పొందుతున్నారు. 
 

58

వరుసగా సినిమా షూటింగ్‌ల్లో పాల్గొని బిజిగా ఉండే స్టార్స్ రిలాక్సేషన్‌ కోసం, ఇలా రెట్టింపు ఎనర్జీని పొందడం కోసం వెకేషన్‌కి వెళ్తుంటారు. ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇప్పుడు మహేష్‌బాబు ఫ్యామిలీ అదే చేసింది. 
 

68

ఇక ఈ సందర్బంగా కేవలం వెకేషన్‌ మాత్రమే కాదు, వర్క్ కూడా చూసుకుంటున్నారు. అక్కడే ఓ యాడ్‌ షూట్‌లోనూ పాల్గొన్నారు మహేష్‌బాబు. రెండూ కలిసి వస్తాయని ఇలా న్యూ ఇయర్‌ సందర్భంగా ప్లాన్‌ చేశారు.

78

ఓ వైపు వర్క్‌, మరోవైపు ఎంజాయ్‌ మెంట్‌ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ షార్ట్ వెకేషన్‌ ముగించుకుని మళ్లీ ఇండియాకి తిరిగి వస్తారు. 

88

ప్రస్తుతం మహేష్‌బాబు `గుంటూరు కారం` సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. శ్రీలీల కథానాయికగా నటించింది. ఇటీవల విడుదలైన మాస్‌ బీట్‌ `కుర్చీ మడతపెట్టి` దుమ్మురేపుతుంది. దారుణంగా ట్రోల్‌ అయ్యింది. సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories