Guppedantha Manasu Serial 1st january:ఎట్టకేలకు వసుతో ఫోన్ మాట్లాడిన రిషి, కానీ వినేసిన శైలేంద్ర..?

Published : Jan 01, 2024, 09:31 AM IST

 శైలేంద్ర వింటున్నాడని.. వసు ఏమీ మాట్లాడదు. తర్వాత... శైలేంద్రకు అర్థం కాకుండా ఉండాలని.. ఏదో ప్రమోషన్ కాల్ లాగా కవర్ చేస్తుంది. కానీ.. రిషి నుంచి కాల్ వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది.  

PREV
19
Guppedantha Manasu Serial 1st january:ఎట్టకేలకు వసుతో ఫోన్ మాట్లాడిన రిషి, కానీ వినేసిన శైలేంద్ర..?
Guppedantha Manasu

Guppedantha Manasu Today:వసుధార  కాలేజీకి వెళ్తూ ఉంటుంది. వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తుంది కానీ.. ఎవరూ కనిపించరు. మళ్లీ.. అలానే అనిపిస్తుంది.. వెనక్కి తిరిగిచూస్తే భద్ర ఉంటాడు. నా వెనకే  ఎందుకు వస్తున్నావ్ అని వసుధార అడిగితే.. మీ వెనకే ఉంటూ మిమ్మల్ని కాపాడమని మహేంద్ర సర్ చెప్పారని.. అందుకే వస్తున్నాను అని చెబుతాడు. దానికి వసు.. నన్ను కాపాడటానికి వచ్చినట్లు లేదు.. భయపెట్టినట్లు ఉంది అంటుంది. భద్ర.. మీ సెక్యూరిటీ కోసమే వచ్చానని.. రాత్రి కూడా మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేయాలని చూశారు కదా అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ వసు.. అతని తోక కట్ చేస్తుంది. ‘ ఇది కాలేజీ.. పట్టపగలు ఇంత మంది మధ్య వచ్చి ఎవరూ ఏం చేయరు. ఇక్కడ ఎవరైనా ఏదైనా చేయాలని చూస్తే స్టూడెంట్స్ ఉన్నారు. ఏ కీలుకి ఆ కీలు ఇరగగొడతారు’ అని చెబుతుంది.

29
Guppedantha Manasu

దానికి భద్ర.. అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఫాలో చేస్తాను అంటాడు. వసు అసలు.. ఫాలో  చేయవద్దని అంటుంది, భద్ర వదలడు.. మీకు ఏదైనా అయితే మహేంద్ర సర్ ఊరుకోరు అని అంటే.. సర్ కి నేను చెబుతాను..నువ్వు వెళ్లు అని భద్రను వసు పంపించేస్తుంది. తర్వాత తన క్యాబిన్ కి వెళ్లిపోతుంది. భద్ర వెనక్కి వెళ్తుంటే.. శైలేంద్ర ఎదురౌతాడు. ‘ తన వెనక ఉండకుండా వచ్చేశావ్ ఏంటి?’ అని శైలేంద్ర అడుగుతాడు. తన వెంట ఉండవద్దని చెప్పింది అని భద్ర అంటాడు. తను చెబితే నువ్వు వినేస్తావా అని శైలేంద్ర అడిగితే.. వినకపోతే.. నిజం మొత్తం కూపీ లాగేస్తుందని భద్ర చెబుతాడు. శైలేంద్రకు విపరీతంగా కోపం వస్తుంది. అలాంటి బోడి మాటలు చెప్పొద్దని.. తనను తెలీకుండా సీక్రెట్ గా ఫాలో అవ్వమని, తన ప్రతి కదలిక తెలుసుకోమని చెబుతాడు. ‘ తను ఎవరిని కలుస్తోంది..? ఎవరితో మాట్లాడుతోంది? ఎవరికి ఫోన్ చేస్తోంది..? తనకు ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోమని చెప్పాను కదా. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ రా? ’ అని శైలేంద్ర సీరియస్ గా అడుగుతుంటే... సడెన్ గా మహేంద్ర వస్తాడు.

39
Guppedantha Manasu

మొత్తం వినేశాడేమో అని కంగారుపడతారు. కానీ.. మహేంద్ర వినడు.  తనతో ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. అతనిని ఏం చేస్తున్నావ్ అని అడుగుతున్నావ్ ఏంటి అని అడుగుతాడు. దీంతో.. శైలేంద్ర కొత్తగా కనపడుతున్నాడని , అందుకే ఎవరు.. ఏం చేస్తున్నావ్ అని అడిగాను  అని శైలేంద్ర అంటే.. ‘అతను తమ డ్రైవర్ అని, మా విషయాల్లో నువ్వు కలగజేసుకోవద్దు, ఆ అవసరం నీకు ఏం ఉంది? ఎండీ సీటుు మీద ఆశలేదని మీ నాన్నకు ఉత్తరం రాసి ఇచ్చావ్ కదా, ఇప్పుడు అన్నయ్య నిన్ను ఇక్కడ చూశాడు అంటే ఏదో ఒకటి అంటాడు. అసలు నిన్ను కాలేజీకి రమ్మని ఎవరు చెప్పారు. ఇంట్రస్ట్ లేదని రాసిచ్చిన తర్వాత మళ్లీ ఎందుకు వచ్చావ్, వచ్చినవాడివి వచ్చినట్లే వెనక్కి వెళ్లు’  అని మహేంద్ర అంటాడు.

49
Guppedantha Manasu

తాను డాడ్ కి లెటర్ రాసిచ్చిన విషయం వసుధార అందరికీ చెప్పేసిందని శైలేంద్రకు విపరీతంగా కోపం వస్తుంది. వసుధార నువ్వు నా ఇగో మీద కొడుతున్నావ్, తప్పుమీద తప్పు చేస్తున్నావ్, అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తావ్ అని అనుకుంటాడు.

59
Guppedantha Manasu

మరోవైపు రిషి.. వసుధారతో ఎలా మాట్లాడాలా అని చూస్తూ ఉంటాడు. ఫోన్ తేవడానికి వెళ్లిన వ్యక్తి.. ఇంకా రాకపోవడంతో ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే పెద్దాయన ఒక ఫోన్ తీసుకొని వస్తాడు.  తీసుకువచ్చి.. రిషికి ఇస్తాడు. రిషి.. వసు నెంబర్ కి ఫోన్ చేస్తాడు. పనిలో ఉండటంతో.. కొత్త నెంబర్ కదా అని కాల్ కట్ చేస్తుంది. రిషి.. మళ్లీ ట్రై చేస్తాడు. వసు మళ్లీ కట్ చేస్తుంది. కానీ.. డౌట్ వచ్చి.. ఎవరు ఫోన్ చేశారా అని అనుకుంటుంది. ఈలోగా.. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని.. ఫోన్ తిరిగి ఇచ్చేయమని అంటాడు. ఈలోగా.. ఆ ఫోన్ కి ఏదో కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే అది వసుధార. రిషి.. ‘ హలో వసుధార..’ అంటాడు. వసు ఫోన్ మాట్లాడేది శైలేంద్ర వింటూ ఉంటాడు.  అది వసు గమనిస్తుంది.  అది తెలియని.. రిషి.. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. శైలేంద్ర వింటున్నాడని.. వసు ఏమీ మాట్లాడదు. తర్వాత... శైలేంద్రకు అర్థం కాకుండా ఉండాలని.. ఏదో ప్రమోషన్ కాల్ లాగా కవర్ చేస్తుంది. కానీ.. రిషి నుంచి కాల్ వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది.

69
Guppedantha Manasu

వెంటనే.. శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతున్నావ్ అనుకుంట.. ఎవరు అని  అడుగుతాడు. , కానీ.. వసు రఫ్ అండ్ టఫ్ గా శైలేంద్రను వాయిస్తుంది. తన పని డిస్టర్బ్ చేయవద్దని, ఇంకోసారి పర్మిషన్ లేకుండా తన క్యాబిన్ లోకి రావద్దు అంటుంది.తర్వాత.. శైలేంద్ర.. ఫోన్ లో మాట్లాడింది రిషి కదా అని అడుగుతాడు. దానికి వసు.. కాదు అని అంటుంది.  కానీ.. శైలేంద్ర నమ్మడు. ఇరిటేట్ అయిన వసుధార.. బయటకు వెళ్లమని గట్టిగా అరుస్తుంది. శైలేంద్ర వెళ్లిపోతాడు.

79
Guppedantha Manasu

వసు.. అలా మాట్లాడేసరికి.. ఏం జరిగి ఉంటుందా? అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. వసు అలా మాట్లాడినందుకు రిషి చాలా బాధపడతాడు.  వసు తనను గుర్తుపట్టిందని, కానీ.. ఎందుకు అలా మాట్లాడిందా అని రిషి ఆలోచనలో పడతారు. తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని రిషి బాధపడతాడు. వసు ప్రమాదంలో ఉన్నా తాను కాపాడలేని పరిస్థితిలో ఉన్నానని ఏడుస్తాడు. ఎంతో ప్రేమగా తనతో మాట్లాడదాం అనుకుంటే.. తాను ఏదోదో మాట్లాడిందని.. తనకు చాలా భయంగా ఉందని ఏడుస్తాడు.

89
Guppedantha Manasu

వసు.. శైలేంద్ర వెళ్లిన తర్వాత.. గది రూమ్ లాక్ చేసుకొని.. మళ్లీ ఫోన్ ట్రై చేయబోతుంది. అదే సమయానికి రిషి కూడా ఫోన్ ట్రై చేస్తాడు. దీంతో.. ఇద్దరికీ బిజీ వస్తుంది. మళ్లీ.. వసు ఫోన్ చేస్తుంది. తర్వాత.. వసు చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఎలా ఉన్నారు సర్ అంటే.. బతికే ఉన్నానని, చావు వరకు వెళ్లి వచ్చి, చావకుండా బతికిపోయాను అంటాడు.  నీతో ఎంత హుషారుగా మాట్లాడదామన్నా..నా ఒంట్లో ఓపిక లేదు అంటాడు. రిషి మాటలకు వసు బాగా ఏడ్చేస్తుంది. రిషి..తన ఆరోగ్య పరిస్థితి వివరిస్తాడు. వసు.. రిషికి ధైర్యం చెబుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. తనకు తెలీదని, లొకేషన్ అడుగుతుంది. ఈ ఫోన్ నుంచి పంపలేం అని చెబుతాడు. పక్కన ఎవరైనా ఉన్నారా అంటే.. తనను కాపాడిన పెద్దయ్య గురించి చెప్పి.. అతనికి ఫోన్ ఇస్తాడు.

99
Guppedantha Manasu

ఆ పెద్దాయనకు వసు చాలా థ్యాంక్స్ చెబుతుంది. తమకు తెలిసిన వైద్యం చేస్తున్నాం అని ఆయన చెప్పి.. తర్వాత.. అడ్రస్ చెబుతాడు. వెంటనే వస్తున్నాను అని వసు అంటుంది.  తర్వాత.. రిషి.. వసుతో మాట్లాడతాడు. నా దగ్గరకు వస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా రమ్మని చెబుతాడు. జాగ్రత్తగా రమ్మని.. ఎదురుచూస్తూ ఉంటానని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి, రేపటి ఎపిసోడ్ లో అయినా వీళ్లు కలుస్తారో లేక.. ఎప్పటిలాగానే శైలేంద్ర, భద్ర ఏదైనా కుట్ర చేస్తారో చూడాలి. 

click me!

Recommended Stories