ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు సెట్ చేస్తున్నారు. ఈ ఏడాది 70 వసంతంలోకి అడుగు పెట్టబోతున్న మెగాస్టార్..విశ్వంభర సినిమాతో అభిమానులను అలరించబోతున్నాడు.
ఈసినిమాతో పాటు... శ్రీకాంత్ ఓదేల్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమాను ఆయన సెట్స్ ఎక్కించబోతున్నాడు. అంతే కాదు అనిల్ రావిపూడి ,చిరంజీవి కాంబోలో కూడా ఓ సినిమాను అనౌన్స్ చేశారు.
గతరెండు మూడేళ్ళు వరుసగా ప్లాప్ సినిమాలతో ఇబ్బందిపడ్డాడు చిరంజీవి. వాల్తేరు వీరయ్య తప్పించి నాలుగైదు సినిమాలు ఆయన్ను నిరాశపరిచాయి. ఇక రాబోతయే సినిమాల విషయంలో కాస్త జాగ్రతత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు చిరు.