సందీప్ కిషన్, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ లో రూపొందిన మజాకా చిత్రం శివరాత్రి నుంచి థియేటర్స్ లో సందడి మొదలుపెట్టబోతోంది. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే. చాలా కాలంగా సందీప్ కిషన్ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మరో వైపు రీతూ వర్మ కూడా మంచి హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ కీలక పాత్రలో నటిస్తోంది. 20 ఏళ్ళ తర్వాత ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది.