ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంది. అదేంటో కాదు.. చిరంజీవికి 10th లో ఎన్ని మార్కులు వచ్చాయి. ఆయన టెన్త్ లో ఏ ర్యాంక్ సాధించారు అనేది వైరల్ అవుతున్న వార్త. అంతే కాదు మెగాస్టార్ 10th సర్టిఫికెట్ కూడా వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకట్ రావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడీ సర్టిఫికేట్ నెట్టింట వైరల్ అవుతోంది.