
రీసెంట్ గా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్నది ఎవరూ అంటే కియారా అడ్వాణీ అని చెప్పచ్చు. హిందీ చిత్రాలతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ తెలుగులోనూ రెండు మూవీస్ చేసి ఇక్కడ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తూ బిజీగా ఉంది. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపైనే అందరి దృష్టీ ఉంది. తెలుగులో విడుదల కాబోయే పెద్ద సినిమాల్లో అదొకటి. ఈ సినిమా రిలీజ్ తర్వాత అసలు కియారా డేట్స్ దొరకవు అంటున్నారు. ఇలా కెరీర్ హ్యాపీగా వెళ్లిపోతున్న టైమ్ లో తాజాగా ఆమె ఓ విచిత్రమైన వివాదంలో వార్తల్లోకి వచ్చింది.
అది మరేదో కాదు కియారా అద్వానీ తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ని లొంగతీసుకవటానికి చేతబడి చేయించిందట. ఈ విషయాన్ని సిద్దార్ద్ మల్హోత్రా అభిమాని సోషల్ మీడియాలో రాసుకురావటంతో అందరూ షాక్ అయ్యారు. సిద్దార్ద్ లైఫ్ డేంజర్ లో ఉంది. కియారా అతన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తోంది. లేకపోతే అతని ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించింది. అంతకు ముందే అతన్ని లైంగికంగా లొంగతీసుకోవాలని అడ్వాన్స్ అవుదామని ట్రై చేసింది.అయినా సిద్దార్ద్ లొంగలేదు.
సిద్దార్ద్ ని కియారా ఫిజికల్ గా , సెక్సవల్ గా, ఫైనాన్సియల్ గా అన్ని విధంగా ఎక్సప్లాయిట్ చేసిందని, అతన్ని తన కో స్టార్స్ తో కలిసి మోసం చేసిందని, చివరకు ఎలా చేసినా లొంగకపోయే సరికి బ్లాక్ మ్యాజిక్ చేయించి పెళ్లి చేసుకుందని తనకు సిద్దార్ద్ ఫ్యాన్ పేజ్ చూసే ఇద్దరు చెప్పారని, కియారా నుంచి తను సిద్దార్ద్ ని బయిటపడేయాలనుకున్నానని అందుకోసం తన సాయిం అడిగారని చెప్పారు. ఈ క్రమంలో తను 50 లక్షలు పోగొట్టుకున్నట్లు చెప్పారు.
అంటే కియారా వల్ల ఆమె భర్త ప్రాణాలకు ముప్పు ఉందని సినిమా కథ టైప్ లో ఓ స్టోరీ చెప్పి ఓ అభిమానిని బురిడీ కొట్టించారు కొందరు ఫేక్ గాళ్ళు. ఏకంగా 50 లక్షలు ఇచ్చి నిండా మునిగిన ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నారు. ఇంతకీ ఎవరా అభిమాని అంటే అమెరికాలో ఉంటున్న మీను వాసుదేవ. అతను సిద్ధార్థ్ మల్హోత్రా కు వీరాభిమాని. ఇప్పుడు అభిమాని తాను ఎలా మోసపోయాడో తెలుపుతూ చేసిన కామెంట్స్ సంచలనం క్రియేట్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో సిద్ధార్థ్ ఫ్యాన్ పేజీ తనను రూ.50 లక్షలు మోసం చేసిందని ఆరోపించారు. సిద్ధార్థ్, అతని భార్య కియారా అద్వానీ పేరిట ఈ మోసం జరిగినట్టు తెలుస్తోంది. నటుడు సిద్ధార్థ్ కూడా ఈ ఫ్యాన్ పేజీని ఫాలో అవుతున్నాడని మీను వాసుదేవ అనే అభిమాని పేర్కొన్నాడు. అమెరికాలో ఉంటున్న మీను.. ఫ్యాన్ పేజీలో నటుడి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారని, ఆ తర్వాత అలీజా, హుస్నా పర్వీన్ అనే ఇద్దరు వ్యక్తులు తనను లక్షలలో మోసం చేశారని చెప్పారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కూడా చాలా పోస్ట్‌లు చేశారు.
‘సిద్ధార్థ్‌ను రక్షించేందుకు సహాయం చేయమని అలీజా నన్ను కోరింది’ అని మీనూ చెప్పటం జరిగింది. తర్వాత మోసగాళ్లు తనను దీపక్ దూబే, సిద్ధార్థ్ పీఆర్ టీమ్‌కు చెందినవాడినని చెప్పుకునే ఇతరులకు కనెక్ట్ చేశారని తెలుపుతూ, వాళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలను అందించారు. సిద్ధార్థ్‌తో మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పడంతో అతనికి వారానికోసారి డబ్బు ఇచ్చాను. నటుడికి సంబంధించిన సమాచారం కోసం, నా దగ్గర ప్రతి వారం డబ్బులు వసూలు చేశారు. నేను సిద్ధార్థ్‌తో మాట్లాడాను కూడా. అయితే నేను మాట్లాడిన వ్యక్తి సిద్ధార్థ్ కాదని, మరెవరో అని తరువాత నాకు అర్థమైంది అని మీనూ చెప్పుకొచ్చారు.
ఇక మీను వాసుదేవ్ తన ‘X’ ఖాతాలో ఈ స్కామ్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. అందులో ఆమె నటుడితో నకిలీ చాట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది సిద్ధార్థ్‌కు సంబంధించిన ఫేక్ స్టోరీలు, గిఫ్ట్ హ్యాంపర్‌ల గురించి ఉంది. ఈ విధంగా మొత్తం రూ.50 లక్షల మేర మోసం చేసినట్లు మీనూ పేర్కొంది. ఈ సీరియస్ ఇష్యూపై సిద్ధార్థ్ మాట్లాడాలని మీనూ మరో పోస్ట్ లో రాసింది. అంతే కాకుండా వీలైతే పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని, ఒకవేళ వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే న్యాయపరంగా శిక్షిస్తానని సదరు ఫ్యాన్ డిమాండ్ చేశారు
2023 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా . రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యఘఢ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కరణ్ జొహార్, షాహిద్ కపూర్, జూహీ చావ్లా తదితరులు హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో పలు దేశాలకు చెందిన వంటలను అతిథులకు వడ్డించారు. దాదాపు బాలీవుడ్ మొత్తం ఈ జంటకు అభినందనలు తెలియచేసారు.
2021లో ‘షేర్షా’ సినిమాతో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్-కియారాలు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ పెళ్లికి దారితీసింది. తమ వివాహ ఫొటోలను షేర్ చేసిన కియారా అద్వానీ.. దానికి.. ‘‘ఇప్పుడు మేం శాశ్వతంగా బుక్ అయిపోయాము’’ (అబ్ హమారీ పర్మనెంట్ బుకింగ్ హో గయీ హై) అని క్యాప్షన్ తగిలించారు. తమ ముందున్న ప్రయాణంలో మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.
కియారా కెరియర్ మొదట్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసి ప్రతిభతో మెప్పించి ఇప్పుడు టాప్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ. ఆ తర్వాత రామ్ చరణ్ జోడిగా వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా హిట్ కాలేదు.
ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్ 2, డాన్ 3 చిత్రాల్లో నటిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో డామినేషన్ కొనసాగిస్తుంది.
ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ కి సోషల్ మీడియా ఫాలోయింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు.. ఈమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇటు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉన్న కియారాకు టాలీవుడ్ నుంచి మరికొన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట.
ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన ఫార్ములా ఒకటే.. నార్త్ హీరోలతో చేస్తే సౌత్‌లో పాపులారిటీ వస్తుందో లేదో గానీ, సౌత్ హీరోలతో చేస్తే మాత్రం నార్త్ లో ప్రమోషన్స్ దుమ్మురేపచ్చు అని! అందుకే సినిమాకు సైన్ చేసే ప్రతి సారీ ఓ సారి సౌత్ వైపు చూస్తున్నారు. నార్త్ లో పరిచయం అక్కర్లేని పేరు కియారా.ప్రామిసింగ్ యాక్ట్రెస్‌గా సక్సెస్‌ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు సౌత్‌లో ఈమె గేమ్ చేంజర్‌లో నటిస్తున్నారు.