Published : Sep 05, 2023, 12:36 PM ISTUpdated : Sep 05, 2023, 12:37 PM IST
ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉదయనిధి కామెంట్స్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉదయనిధి కామెంట్స్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాని నిర్మూలించాలి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
26
పలు చోట్ల హిందూ సంఘ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు కూడా పెట్టారు. ఉదయనిధి స్టాలిన్ ని సినీ అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ చివరగా నటించిన మామన్నన్ చిత్రం మంచి విజయం సాధించింది. సినిమాల్లో ఆఫర్స్ తగ్గాకే ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి వెళ్లారని.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
36
తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టాలిన్.. డెంగ్యూ, మలేరియా ఎలాగో.. సనాతన ధర్మం కూడా అంతే. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు. నిర్మూలించాలి అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేసిన పాత ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
46
2020లో రాంచరణ్ 'సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాద్యత.. భారతీయ కల్చర్ మ్యాటర్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో తన తల్లి సురేఖ తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫోటోని షేర్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ నేపథ్యంలో చరణ్ ట్వీట్ ని నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
56
Photo Courtesy: Instagram
సనాతన ధర్మం పట్ల సీఎం తనయుడు అభిప్రాయం, చిరంజీవి కొడుకు అభిప్రాయం ఎలా ఉన్నాయో చూడండి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రాంచరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉదయనిధిని ట్రోల్ చేస్తున్నారు.
66
తన వ్యాఖ్యలపై ఇంత వివాదం చెలరేగినా ఉదయనిధి స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన కామెంట్స్ కి ఇప్పటికి కట్టుబడి ఉన్నానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. బిజెపి వాళ్లే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అంటూ ఉదయనిధి తెలిపారు.