ప్రేమించిన ప్రియురాలిని.. సైలెంట్ గాపెళ్ళాడిన బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా.. వైరల్ అవుతున్న ఫోటోలు

Published : Sep 05, 2023, 11:23 AM IST

ఈమధ్య సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాచిలర్స్ గా  ఉన్న యంగ్  స్టార్స్ అంతా ఓ ఇంటివారు అవుతున్నారు. అందులో వెంటితెరతో పాటు..బుల్లితెర తారలు కూడా ఉన్నారు.   

PREV
18
ప్రేమించిన ప్రియురాలిని.. సైలెంట్ గాపెళ్ళాడిన బిగ్ బాస్ ఫేమ్  మహేష్ విట్టా.. వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ స్టార్స్ ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. శర్వానంద్ లాంటి టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలతో పాటు.. అమర్ దీప్ లాంటి బుల్లితెర తారలు.. తాజాగా తెలుగు హీరో  త్రిగుణ్ అలియాస్ అధిత్ అరుణ్  కూడా పెళ్లి బంధంతో.. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పాడు. ఇక తాజాగా ఓ బుల్లితెర కమ్ వెండితెర స్టార్  మహేష్ విట్ట కూడా  ఓ ఇంటివాడు  అయ్యాడు. 

28

సోషల్ మీడియా స్టార్ గా ఎదిగాడు మహేష్ విట్టా. టిక్ టాక్ వీడియోలు.. షార్ట్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. యూట్యూబర్ గా  మహేష్ విట్టా అందరికీ సుపరిచితమే. ఓ యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. షార్ట్ ఫిలిమ్స్  తో అలరించి.. నటనతో మెప్పించి.. రాయలసీమ యాసలో అదరగొట్టి.. అద్భఉతం చేశాడు మహేష్. 
 

38

ముఖ్యంగా మహేష్ విట్టాకు ఫన్ బకెట్ అనే కామెడీ సిరీస్  మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. చిత్తూర్ స్లాంగ్ లో అతను పలికే డైలాగులు అందరినీ నవ్వించాయి. మహేష్ టాలెంట్ ను గుర్తించిన మేకర్స్..  నాని నటించిన ష్ణార్జున యుద్ధం సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు.

48
Mahesh Vitta

ఆసినిమా హిట్ అవ్వకపోయినా.. మహేష్ టాలెంట్ గుర్తించి.. వెంట వెంటనే..శమంతకమణి, టాక్సీ వాలా, నిను వీడని నీడను నేను, ఏ1 ఎక్స్ ప్రెస్, ఛలో, యురేక ,కొండపొలం, అల్లుడు అదుర్స్, సకల గుణాభిరామ లాంటి సినిమాలలో నటించి మెప్పించాడు మహేష్. 

58

 అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 3 లో స్టార్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. దాదాపు  60 రోజుల పైనే  హౌస్ లో ఉన్నాడు మహేష్. అంతే కాదు భారీ రెమ్యూనరేషన్ కూడా జేబులో వేసుకుని వెళ్ళాడు మహేష్. ఇక తాజాగా మహేష్ విట్టా పెళ్లి పీటలెక్కాడు. తాను ప్రేమింన అమ్మాయి శ్రావణీతో ఘనంగా మహేష్ వివాహం జరిగింది. 
 

68

పెద్దగా ఆర్బాటం లేకుండా..హడావిడి లేకుండా.. అసలు ఎవరికీ చెప్పకుండా.. కామ్ గా పెళ్ళి చేసుకున్నాడు మహేష్ విట్టా. గతంలో తన ప్రేమవిషయాన్ని ఓపెన్ గానే చెప్పిన మహేష్.. తాజాగా ఓ ఇంటివాడు అయ్యాడు. 

78

కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరులోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో (Mahesh Vitta) మహేష్ – శ్రావణి ల వివాహం తమ బంధుమిత్రుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. శ్రావణి .. మహేష్ చెల్లెలి ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఆ రకంగా వీరి మధ్య పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగినట్లు తెలుస్తుంది. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

88

తాజాగా మహేష్ గోల్డెన్ ఛాన్స్ ను మిస్ అయ్యాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చిన పుష్ప సినిమాలో.. పుష్పరాజ్ అసిస్టెంట్ గా.. కేశవ పాత్ర మొదట మహేష్ కే వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల అది మిస్ చేసుకున్నాడు మహేష్. చిత్తూరు స్లాంగ్ వచ్చిన వారు ఈ పాత్ర అద్భుంగా చేయవచ్చు. మహేష్ చిత్తూరు స్లాంగ్ గురించి అందరికి తెలిసిందే. మరి ఈ అవకాశం ఎలా మిస్ చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories