Ram Charan in OG: ఓజీలో అనుమతి లేకుండా రాంచరణ్ ఫోటో ఎందుకు పెట్టారు ? అసలు మ్యాటర్ తెలిస్తే పూనకాలే

Published : Sep 28, 2025, 06:37 PM IST

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ విషయంలో డైరెక్టర్ సుజీత్ అనేక ఆసక్తికరమైన సందేహాల్ని అలాగే వదిలిపెట్టేశారు. ఈ మూవీలో రాంచరణ్ ని పోలిన ఫోటో గ్లింప్స్ చూపించారు. ఆ ఫొటోలో ఉన్నది నిజంగానే రాంచరణేనా.. ఓజీ కథతో చరణ్ కి ఉన్న లింక్ ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
దూసుకుపోతున్న ఓజీ మూవీ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలై విజయవంతంగా రన్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు దక్కుతున్నాయి. మూడు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 125 కోట్ల షేర్ రాబట్టింది. డైరెక్టర్ సుజీత్ సినిమా మొత్తం యాక్షన్ ప్యాక్డ్ అన్నట్లుగా తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్ విధ్వంసం, పడ్డ ఎలివేషన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఓజీ చిత్రాన్ని, సాహో మూవీనే కనెక్ట్ చేస్తూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని సుజీత్ క్రియేట్ చేశారు. 

25
ఓజీ 2 ప్రకటన 

ఓజీ చిత్రాన్ని ప్రీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. మూవీ చివర్లో ఓజీ 2 అని అనౌన్స్ చేశారు. అందులో ఓజీ అసలు జపాన్ లో ఏం చేశారు ? అక్కడున్న ఒక గ్యాంగ్ ని ఎలా అంతం చేశాడు అనే కథ ఉంటుంది. ఓజీ కథలో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఓజీ కథకి జపాన్ కనెక్షన్ తో పాటు, సుభాష్ చంద్రబోస్ కథ కూడా యాడ్ అవబోతున్నట్లు తెలుస్తోంది. ఓజీ మూవీలో సుజీత్ ఇచ్చిన డీటెయిల్స్ గమనిస్తే.. పవన్ కళ్యాణ్ ఉపయోగించే తుపాకీ చూసి పోలీస్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది అప్పట్లో ఆర్మీవాళ్ళు మాత్రమే ఉపయోగించే తుపాకీ. అంటే పవన్ కళ్యాణ్ కి ఆర్మీ కనెక్షన్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆర్మీలో ఉండరు. 

35
ఓజీ మూవీలో రాంచరణ్ ?

సుభాష్ చంద్రబోస్ అప్పట్లో టోక్యోకి వెళుతూ అదృశ్యమయ్యారు. మరణించారని కొందరు, లేదని మరికొందరు అప్పట్లో వాదించారు. దీని ఆధారంగానే సుజీత్ ఓజీలో సుభాష్ చంద్రబోస్ పాత్రని ఇన్వాల్వ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ఇండియన్ ఆర్మీని 1945 ప్రాంతంలో తరలించి ఉండే అవకాశం ఉంది. కథ ప్రకారం ఓజీ జన్మించింది 1959లో.. అంటే సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో ఉండే వ్యక్తి ఓజీ తండ్రి. ఓజీ తల్లిదండ్రులుగా మూవీలో ఒకఫోటో కూడా చూపించారు. అది అచ్చం రాంచరణ్ లాగే ఉంది. ఫ్యాన్స్ అయితే అది రాంచరణే అని ఫిక్స్ అయిపోయారు. దీని గురించి సుజీత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఫొటోలో ఉన్నది రాంచరణ్ కాదని.. అది కూడా పవన్ కళ్యాణ్ గారే అని సుజీత్ తెలిపారు. 

45
మెగా ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంటారు 

పవన్ కళ్యాణ్ గారికి కొత్త లుక్ తీసుకువచ్చే ప్రయత్నంలో ఆ ఫోటో రాంచరణ్ లాగా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలిలో ఏ హీరోని తీసుకున్నా ఒకరితో ఒకరికి చాలా స్పష్టమైన పోలికలు ఉంటాయి. ముఖ్యంగా ఆ హీరోలందరికీ చాలా పవర్ ఫుల్ కళ్ళు ఉంటాయి అని సుజీత్ అన్నారు. వైష్ణవ్ తేజ్ ని ఒక యాంగిల్ లో చూస్తే చిరంజీవి లాగా మరో యాంగిల్ లో చిరంజీవి లాగా ఉంటారు. రాంచరణ్, పవన్ కళ్యాణ్ మధ్య కూడా పోలికలు ఉన్నాయి. కాబట్టి ఆ ఫోటో అలా అనిపించి ఉండొచ్చు. వాళ్ళ అనుమతి లేకుండా ఫోటో ఎలా ఉపయోగిస్తాం అని సుజీత్ తెలిపారు. కానీ ఫ్యాన్స్ మాత్రం వాంటెండ్ గా సుజీత్  రాంచరణ్ ఫోటో వాడారు అని అంటున్నారు. 

55
రాంచరణ్ తో సుజీత్ మూవీ ప్లాన్ 

వాస్తవానికి సాహో తర్వాత సుజీత్ రాంచరణ్ తో సినిమా ప్లాన్ చేశారు. కానీ కోవిడ్ రావడంతో సుజీత్ ప్లాన్ నీరుగారిపోయింది. కానీ ఓజీ చిత్రం వచ్చి సక్సెస్ సాధించడం మాత్రమే కాదు అటు ప్రభాస్, ఇటు రాంచరణ్ ఫ్యాన్స్ లో కూడా ఆసక్తిని పెంచేసింది. మరి సుజీత్ ఓజీ 2 ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర పాత్రల్లో మెరిశారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. 

Read more Photos on
click me!

Recommended Stories