క్రేజీ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ స్టైలీష్ పిక్స్ వైరల్

First Published | Aug 17, 2024, 4:25 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మామూలోడు కాదు.. ఎప్పటికప్పుడు ఆయన తన లుక్స్ ను మార్చుకుంటూ.. ఫ్యాన్స్ సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు.. ఏజ్ పెరుగుతున్నా కొద్ది మరింత హ్యాండ్సమ్ గా తయారవుతున్నాడు రామ్ చరణ్. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 40 ఏళ్లకు చాలా దగ్గరలో ఉన్నాడు. కాని ఎప్పటికప్పుడు తన ఫిట్ నెస్ తో పాటు.. గ్లామర్ తో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తున్నాడు. ఏజ్ పెరుగుతన్నా కొద్ది మంరింత హ్యాండ్సమ్ గా తయారవుతున్నాడు చరణ్. టాలీవుడ్ స్టైలీష్ ఐకాన్ లా చరణ్ మారిపోయారు. ఎప్పటికప్పుడు సినిమాల కోసం ఛేంజ్ అవుతూ.. ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాడు. డ్రెస్సింగ్ , హెయిర్ స్టైల్ విషయంలో.. డిఫరెంట్ గా ట్రై చేస్తూ.. ఫ్యాన్స్ ఫిదా చేస్తున్నాడు. 
 

తాజాగా చరణ్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చరణ్  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. ఈసినిమా అంతా కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ఇక ఈమూవీ రిలీజ్ అయ్యే లోపు.. బుచ్చిబాబు సాన ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వబోతున్నాడు చరణ్. అందుకోసం రెడీ అవుతున్నాడు. ఈమూవీ కోసం లుక్స్ కూడా చేంజ్ చేసుకున్నాడు రామ్ చరణ్. 
 


ఇక తాజాగా  రామ్ చరణ్ ఆస్ట్రేలియా లో ల్యాండ్ అయ్యాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ అక్కడికి  వెళ్ళాడు. అయితే అక్కడి ఫోటోలలో రామ్ చరణ్  లుక్ మాత్రం డిఫరెంట్ గా ఉంది.. ఫ్యాన్స్ ను  బాగా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ లాంగ్ హెయిర్ తో పాటుగా, గడ్డంతో క్యాప్ పెట్టుకుని.. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

'అయితే ఈ లుక్స్  బుచ్చిబాబు సినిమా కోసమే అని అర్ధం అవుతుంది. దాంతో ఈ రేంజ్ లుక్ ను ప్లాన్ చేశారంటే.. సినిమా ఇంక ఎలా ఉంటుందా అని ముందు మెగా అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరి ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు.. ఇదే ఫైన్ లుక్ ఆ.. లేక ఇంకాస్త చేంజ్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. RC16 లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Latest Videos

click me!