జాన్వీ కపూర్ జాకెట్ కోసమే 50 వేలు.. మరి చీరకాస్ట్ తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే..?

First Published | Aug 17, 2024, 3:13 PM IST

ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్ లతో హడావిడి చేసే జాన్వీ కపూర్.. తాజాగా సంప్రదాయానికి చీరకట్టినట్టుగా తయారయ్యింది. చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న అతిలోక సుందరి.. ఈ కాస్ట్ర్యూమ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా..? 

ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్ లతో సోసల్ మీడియాను నింపేస్తుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కాని ఈమధ్య అప్పుడప్పుడు సంప్రదాయాన్ని ఫాలో అవుతూ.. ట్రెడిషినల్ డ్రస్సులో కూడా కనిపిస్తోంది. రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో జాన్వీ కపూర్ అందరిని ఆశ్చర్య పరిచింది. ఆమె చీరకట్టుకుని అందంగా అద్భుతంగా అందరి ముందుకు వచ్చింది. రెడ్ కార్పెట్ మీద రెడ్ ఆర్గాంజా చీరలో కనిపించింది. 

అందమైన క్రిమ్సన్ చీరలో  జాన్వీ కపూర్   ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఫ్యాషన్ డ్రెస్సులతో పాటు జాన్వీ కపూర్ కు చీరలంటే ఇష్టం ఎక్కువ. ఈ విషయంలో తన తల్లిని ఫాలో అవుతుంటుంది జాన్వీ. అయితే చీరల విషయంలో తనకు ఎంతో ఇష్టమైన డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలను కట్టుకోవడానికి ఆమె ఇష్టపడుతుంది. అయితే ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది జాన్వీ. 


సరోజా రమణి  డిజైనర్ శారీని ఆమె కట్టుకుంది. అ చీర అందానికి అందరు ముగ్ధులైపోతున్నారు. పెర్ల్ ఎంబ్రాయిడరీ తో పాటు సున్నితమైన హ్యాండ్ వర్క్ చేయబడిని ఈ చీరపై టోరీ వర్క్‌ తో అద్భుతంగా  రూపొందించబడింది. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడిన చీర. సంప్రదాయబద్దంగా కనిపిస్తున్న ఈ చీరతో పాటు.. మ్యాచింగ్ బ్లైజ్ కూడా చాలా కాస్ట్లీగానే తయారు చేయించుకుంది జాన్వీ కపూర్. ఈరెండిటిపై.. హ్యాండ్ వర్క్ తో డిజైన్స్ చేయించుకుంది. 
 

Actress Janhvi Kapoor Viral Photos

ఎరుపు రంగు చీరకు అందంగా కనిపించే బ్లౌజ్‌ని కూడా చేయించుకుంది జాన్వీ.  డిజైనర్ మయూరి రమణి బ్లౌజ్ గా పిలవడే ఆ జాకెట్ కాస్ట్ 50 వేల వరకూ ఉంటుందని అంచనా. ఇక ఇది బటర్‌ఫ్లై నెట్ ఫాబ్రిక్‌తో తయారు చశారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ పెర్ల్ తో పాటు  డబ్కా టెక్నిక్‌ని ఇది కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జాకెట్ కే 50 వేలు పెట్టిన జాన్వీ కపూర్.. చీరకోసం ఎంత ఖర్చు పెట్టి ఉంటుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

ఇక మెరిసే ఈ అందమైన అద్భుతమైన చీర కాస్ట్ దాదాపు లక్షన్నర పైనే ఉంటుందని అంచనా. ఇక జాన్వీ కపూర్ యొక్క కొత్త చీరను చూసి ప్యాన్స ఫిదా అవుతున్నారు. ఆమె లేడీ ప్యాన్స్ అయితే.. జాన్వీ కపూర్ టేస్ట్ నుతెగ పొగిడేస్తున్నారు. ఆమె ఇప్పటి వరకూ చేసిన ఫోటో షూట్లు.. స్పెషల్ లుక్స్ లో ఇది మరింత అద్భుతమంటున్నారు. 
 

Janhvi Kapoor Viral Saree

జాన్వీ..  సాంప్రదాయ దుస్తులతో పాటు..రంగురంగుల ఆభరణాలతో మరింత అట్రాక్టీవ్ గా తయారయ్యింది. ముత్యాలు, పచ్చలు, చోకర్, తో పాటు.. అందమైన చెవిపోగులు.. గోలుసులతో దేవతలా కనిపించింది. ముక్కు పుడకతో పాటు.. చేతికి ఉంగరం. గాజలు.. ఇలా సాంప్రదాయ బద్దంగా కనిపించింది జాన్వీ. ఇక జాన్వీ ప్రస్తుతం సౌత్ ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో పాటు రామ్ చరణ్ సినిమాలో కూడా జాన్వీ నటించబోతోంది. దేవర త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Latest Videos

click me!