వరుణ్ పని అయిపోయిందా? డేంజర్ జోన్లో మెగా హీరో!

Published : Mar 02, 2024, 02:38 PM IST

వరుణ్ తేజ్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఆయన మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. గద్దలకొండ గణేష్ తర్వాత విడుదలైన చిత్రాలన్నీ దారుణ పరాజయం చవి చూశాయి. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ ప్రమాద ఘంటికలు మోగించింది.   

PREV
16
వరుణ్ పని అయిపోయిందా? డేంజర్ జోన్లో మెగా హీరో!


వరుణ్ తేజ్ భిన్నంగా ఆలోచిస్తాడు. విలక్షణ సబ్జక్ట్స్ ఎంచుకుంటాడు. పాత్ర కోసం కష్టపడతాడు. వీటన్నింటికీ మించి గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన మెగా ఫ్యామిలీ హీరో. ఎన్ని ఉన్నా అదృష్టం కూడా ఒకటి ఉండాలి. వరుణ్ తేజ్ కి ఏమీ కలిసి రావడం లేదు. 
 

26

జిగర్తాండ రీమేక్ గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ కి హిట్ లేదు. ఆయన చిత్రాల వసూళ్లు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ వరల్డ్ వైడ్ రూ. 15 కోట్ల షేర్ రాబట్టింది. వరుణ్ తేజ్ కి హిట్ కట్టబెట్టింది. 

 

36

అనంతపురం స్పోర్ట్స్ డ్రామా గని చేశాడు. వరుణ్ బాక్సర్ రోల్ చేయగా... శిక్షణ తీసుకున్నాడు. ప్రొఫెషనల్ గా కనిపించడం కోసం చాలా కష్టపడ్డాడు. నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేశాడు. ఇంత కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. గని కనీస ఆదరణకు నోచుకోలేదు. 

46
Gandeevadhari Arjuna Review

గని వరల్డ్ వైడ్ కేవలం రూ. 4.75 కోట్ల షేర్ రాబట్టింది. ఎఫ్ 3 మల్టీస్టారర్ కాగా యావరేజ్ రిజల్ట్ అందుకుంది. అనంతరం విడుదలైన గాండీవధారి అర్జున వరుణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ కేవలం రూ. 1.5 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 

56

మార్చి 1న విడుదలైన ఆపరేషన్ వాలెంటైన్ సైతం నిరాశపరిచింది. ఈ మూవీ వరుణ్ మార్కెట్ కి మించిన బడ్జెట్ తో తెరకెక్కించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా పిలిచి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. చిరంజీవి ప్రచారం కల్పించినా.. కనీస ఓపెనింగ్స్ రాలేదు. 

 

66

మెగా పిన్స్ వరుణ్ తేజ్ విభిన్న కథలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి ఆయన చిత్రాలు మరో చిత్రంతో ఏమాత్రం పోలిక లేకుండా ఉన్నాయి.

click me!

Recommended Stories