కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల విషయంలో ఓ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.. అందేంటో కాదు దుమ్ములేపుతున్న టైటిల్స్ సాంగ్సే.. ఇప్పటికీ అదిరిపోయే సాంగ్స్ వస్తున్నాయి. ది బెస్ట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం.
హీరో ఎలివేషన్ తో కూడిన టైటిల్ సాంగ్ అంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన ‘అతడు’ అనే చెప్పాలి. ఈ రేంజ్ లో ఫ్యాన్స్ మహేశ్ బాబును ఫ్యాన్స్ ఇప్పటికీ చూసి లేరనే చెప్పాలి.
211
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. కానీ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ‘జల్సా’ సాంగ్స్ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. పవన్ కు తగ్గట్టుగా జల్సా టైటల్ సాంగ్ ఉంటుంది.
311
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన చిత్రాల్లో రేసు గుర్రం, బన్నీ చిత్రాల టైటిల్ సాంగ్స్ దుమ్ములేపాయి. మాస్ బీట్స్ తో అప్పట్లో ఆకట్టుకున్నాయి.
411
అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ (Panja) టైటల్ సాంగ్ కూడా ఇప్పటికీ సంగీత ప్రియులకు గూస్ బంప్స్ ను తెప్పిస్తుంటుంది.
511
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం టైటిల్ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంటుంది. దేవీశ్రీ క్యాచీ ట్యూన్ ను అందించారు. అలాగే ఎన్టీఆర్ Temper టైటిల్ సాంగ్ కూడా ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది.
611
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ’ఛత్రపతి‘లోని టైటిల్ సాంగ్ కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఛత్రపతి, కాట్రాజ్ ఫైటింగ్ కు ముందు వచ్చే సాంగ్ అది.
711
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) మాఫియా కోణంలో తీసిన చిత్రం ‘బిల్లా‘. ఈ చిత్రంలోని Billa Song ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆ పాటకు దర్శకుడు మెహర్ రమేశ్ లిరిక్స్ అందించడం విశేషం.
811
ఇక భారీ చిత్రాల్లో ప్రభాస్ బాహుబలి చిత్రంలోని టైటిల్ సాంగ్ ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈ సాంగ్ అప్పుడే కాదు.. ఇప్పుడూ ఆడియెన్స్ కు కొత్త ఫీలింగ్ ను కలిగిస్తుంటుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
911
ఇక ఇలా సినిమా టైటిల్స్ తో ఎన్నో పాటలు వచ్చాయి. కానీ ఈ సాంగ్స్ మాత్రం హీరోల రేంజ్ కు తగ్గట్టుగా ఉండటం విశేషం. ఇప్పటికీ టాలీవుడ్ లో అదే ట్రెండ్ కొనసాగుతోంది. 2022లో డీజే టిల్లు టైటిల్ సాంగ్ ఓ ఊపూపింది.
1011
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం ‘ధృవ’ Dhruva మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు.
1111
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర (Devara) సాంగ్స్ పైనా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుంచి వచ్చి గ్లింప్స్ లోని దేవర ట్యూన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.