' పుష్ప 2' బిజినెస్ కి భారీ దెబ్బ ? అంత నష్టమొస్తుందా ? తల పట్టుకున్న నిర్మాతలు ?

First Published Jun 17, 2024, 10:59 AM IST

ఆగస్ట్ 15 తేదీకి రిలీజ్ అని ఎగ్రిమెంట్ చేసుకుని బిజినెస్ డీల్స్ భారీ రేట్లకు నిర్మాతలు క్లోజ్ చేసారు. ముఖ్యంగా నార్త్ నుంచి భారీ అడ్వాన్స్ లు వచ్చాయి. 

Pushpa 2

అల్లు అర్జున్(Allu Arjun) తాజా చిత్రం  పుష్ప 2  పై రోజుకో వార్త వస్తూ ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్న్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఓ రేంజిలో  ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.  పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ డమ్ రావడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ రెండు పాటలు రిలీజ్ చేసి మరింత హైప్ పెంచారు. పుష్ప 2 సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క పవన్ ఫ్యాన్స్ తో పుష్ప 2 కి  ఓపినింగ్స్ సమస్య వస్తుందని..వాళ్లు బాయికాట్ చేయబోతున్నారనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో సినిమా బిజినెస్ పై ఈ ఇంపాక్ట్ పడుతోందని తెలుస్తోంది.
 


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  పుష్ప 2 సినిమా షూటింగ్ ఎంత శరవేగంగా చేసినా అనుకున్న తేదీకి రిలీజ్ అవటం కష్టమే అంటున్నారు.  ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం. అప్పటికీ  చెప్పిన టైంకి సినిమా తీసుకురావడానికి సుకుమార్ ప్లాన్ చేసి  మూడు యూనిట్ లుగా టీమ్ ని విడతీసి మరీ షూట్ చేస్తున్నారట.వాటిలో  రెండు యూనిట్లు రామోజీ ఫిలిం సిటీలో, ఒక యూనిట్ మారేడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో పుష్ప 2 వాయిదా పడటం కన్ఫర్మ్ అని త్వరలోనే ప్రకటన రావచ్చు అని అంటున్నారు. 
 


నిర్మాతలు మాత్రం వాయిదా నిర్ణయానికి సముఖంగా లేరట. అల్లు అర్జన్ ని సుకుమార్ కన్వీన్స్ చేయగలిగినా ప్రొడ్యూసర్స్ మాత్రం ఒప్పుకోలేకపోతున్నారట. అందుకు కారణం వాయిదా వార్తలతో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న ఒత్తిడి అంటున్నారు. ఆగస్ట్ 15 తేదీకి రిలీజ్ అని ఎగ్రిమెంట్ చేసుకుని బిజినెస్ డీల్స్ భారీ రేట్లకు నిర్మాతలు క్లోజ్ చేసారు. ముఖ్యంగా నార్త్ నుంచి భారీ అడ్వాన్స్ లు వచ్చాయి. అయితే ఇప్పుడు వాయిదా పడితే మొత్తం ఎగ్రిమెంట్స్ రివైజ్ చేయాల్సి ఉంటుంది.


ఈ క్రమంలో  వడ్డీకు తెచ్చిన డబ్బుతో  సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ గోలెత్తిపోతున్నారట. ఇప్పుడు ఆ వడ్డీ నష్టాన్ని నిర్మాతలే చెల్లించాల్సిన పరిస్దితి. దాంతో ఇప్పుడు అనుకున్న రేట్లకు తగ్గించి సినిమా ఇస్తున్నట్లు రీ ఎగ్రిమెంట్ చేసుకోవాలి.  అలాగే ఆగస్ట్ 15 లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా మిస్సవుతోంది. దాంతో తమకు కలక్షన్స్ దెబ్బ పడుతుందని అంటున్నారట.
 


ఇవన్నీ ఒకెత్తు అయితే పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు అల్లు అర్జున్ మీద. దాంతో వాళ్లంతా పుష్ప 2 ని బాయ్ కాట్ చేస్తారనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. అదే జరిగితే చాలా కలెక్షన్స్ దెబ్బతింటాయి.  ఈ విషయం కూడా డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలతో చెప్పి రిబేట్ అడుగుతున్నారట. రెండు నెలల క్రితం కూల్ గా ఉన్న పరిస్దితి ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ అవటం నిర్మాతలు ఊహించని విషయం. 

pushpa2

   
ఇది ఇక్కడితో ఆగలే లేదు. ఓటిటి సంస్దల నుంచి  డిజిటల్ హక్కుల కోసం చేసుకున్న ఎగ్రిమెంట్ విషయమై కూడా రివైజ్ చేయాలి. అంటే ఖచ్చితంగా వాళ్లు రేట్ తగ్గిస్తారు.   వీటితో పాటు సంస్ద సినిమా కోసం ఫైనాన్స్ వడ్డీలు కూడా పెరుగుతాయి.  ఇలా  రిలీజ్ డేట్ మార్చడంతో ‘పుష్ప-2’ నిర్మాతల కు వచ్చే సమస్యలు మామాలుగా ఉండవు. 


అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడుతుందా? ఆగస్ట్ 15న ఆ మూవీ రావడం లేదా?  అనే  వాయిదా వార్తలు కు  తాజాగా మేకర్స్ మరోసారి తమ మూవీ అదే రోజున వస్తుందని స్పష్టం చేశారు. సెకండ్ సింగిల్ సూసేకి సాంగ్ రీల్స్ రూపంలో క్రియేట్ చేస్తున్న రికార్డుల గురించి చెబుతూ రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేశారు.

Pushpa2


కాకపోతే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల తేదీ ఆగస్ట్ 15 కు  ఖరారైంది.  ఆగస్టు 15న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ చిత్ర వర్గాలు  కొత్త పోస్టర్‌ను విడుదల చేశాయి. ఇది రామ్‌ - పూరి జగన్నాథ్‌ల కలయికలో వస్తున్న రెండో సినిమా. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. దీంట్లో కావ్య థాపర్‌ హీరోయిన్ గా కనిపించనుండగా.. సంజయ్‌ దత్, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప 2’ వాయిదా పడనున్నట్లు ప్రచారం వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడదే తేదీకి ఈ చిత్రం వస్తుండటం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. 


ఏదైమైనా పుష్ప 2 50 రోజుల షూటింగ్ పెండింగ్ అనేది నిజమైతే  ఎప్పటికి అవ్వుద్ది? దానికి సంబంధించిన CG, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎప్పటికి పూర్తవుతాయి అనేది పెద్ద ప్రశ్నే. రిలీజ్ డేట్ కి ఇంకా రెండు నెలల సమయమే ఉంది, ఈ లోపు పుష్ప 2 పూర్తవుద్దా అని డౌట్.  మరో వైపు రామ్ డబల్ ఇస్మార్ట్ సినిమా సడెన్ గా ఇదే డేట్ కి రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో పుష్ప 2 సినిమా వాయిదా పడుతుంది కాబట్టే ఆ సినిమా వచ్చిందని ఇండస్ట్రీ జనాలు ఫిక్స్ అయిపోయారు.  దాంతో పుష్ప 2 వాయిదా మేటర్ అనేది క్లారిటీ లేకుండా పోయింది. 
 


ప్రస్తుతం  ‘పుష్ప ది రూల్’ భారీగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి.   యానిమల్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి (tripti dimri)బన్నీ తో కలిసి పుష్ప 2 కి సంబంధించిన  ఐటెం సాంగ్ లో  చిందులేయనుందని తెలుస్తోంది.  మాస్ ఐటెం సాంగ్ దేవి ఇచ్చాడని, థియోటర్స్ ఊగిపోతాయని అంటున్నారు. 


ఇక పుష్ప 2 చిత్రానికి ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో భీబత్సమైన క్రేజ్ ఉంటుంది. అయితే హిందీ బెల్ట్ లలో మాత్రం ఇంకా క్రేజ్ మొదలు కాలేదు. ఫస్ట్ సాంగ్ డీసెంట్ గా రెస్పాన్స్ వచ్చిందని కానీ ఇనిస్టెంట్ ఛాట్ బస్టర్ కాలేదు. దాంతో ఇంకా అక్కడ పుష్ప 2 ఫీవర్ ప్రారంభం కాలేదు. అందుకోసం నిర్మాతలు ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఫీవర్ తగ్గింది కాబట్టి పుష్ప ఫీవర్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. 
 


 పుష్పలో  ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.   అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు మేక‌ర్స్ .  ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  

Latest Videos

click me!