మెగా ఫ్యామిలీని భయపెడుతున్న నిహారిక... కోరుకున్నది ఇవ్వలేరు, కంట్రోల్ చేయలేరు!

Published : Apr 16, 2024, 08:32 AM IST

మెగా ఫ్యామిలీలో రెబల్ కిడ్ గా ఉంది నిహారిక. ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి. విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నిహారిక మెగా ఫ్యామిలీని భయపెడుతుంది.   

PREV
17
మెగా ఫ్యామిలీని భయపెడుతున్న నిహారిక... కోరుకున్నది ఇవ్వలేరు, కంట్రోల్ చేయలేరు!
Niharika Konidela

నాగబాబు తనయ నిహారిక ఒక గ్లామరస్ ఇమేజ్ కోరుకుంటుంది అనేది నిజం. ఇతర హీరోయిన్స్ మాదిరే కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలి అనేది ఆమె కోరిక. అందుకే నిహారిక తరచుగా ఫోటో షూట్స్ చేస్తున్నారు. 

27
Niharika Konidela

నిజానికి నిహారిక హీరోయిన్ కావడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదనే వాదన ఉంది. మెగా ఫ్యాన్స్ నిహారిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని అప్పట్లో తీవ్రంగా ఖండించారు. చిరంజీవి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి హీరోయిన్ కావడం మాకు నచ్చలేదని అన్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. 

37
Niharika Konidela

నిహారిక పంతం నెగ్గించుకుని హీరోయిన్ అయ్యింది. అయితే గ్లామరస్ రోల్స్, బోల్డ్ సీన్స్ కి దూరంగా ఆమె ఉన్నారు. ఆమె నటించిన ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం.. ఆడలేదు. చెప్పాలంటే మెగా హీరోలు పెద్దగా ప్రోత్సహించలేదు. ప్రమోట్ చేయలేదు. 

 

47
Niharika Konidela

హీరోయిన్ గా సక్సెస్ కాకపోతే పెళ్లి చేసుకోవాలని నాగబాబు కండిషన్ పెట్టారట. దాని ప్రకారం 2020లో నిహారిక వివాహం చేసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం నటన మీదే ఉంది. అందుకు అత్తింటి వారు ఒప్పుకోకపోవడమే విడాకులకు కారణం అనే ఓ పుకారు ఉంది. నిహారిక ఇటీవల కామెంట్స్ పరోక్షంగా ఇదే చెబుతున్నాయి. 

57

విడాకుల అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది నిహారిక. నిర్మాతగా, నటిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే చెఫ్ మంత్ర పేరుతో ఆహాలో ఒక షో చేస్తుంది. ఓటీటీ కావడంతో గెస్ట్స్ ని డబుల్ మీనింగ్ ప్రశ్నలు అడుగుతుంది నిహారిక. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. 

67
Niharika Konidela

మెగా ఫ్యామిలీ ఇమేజ్ ని నిహారిక దెబ్బ తీస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో ఆమె చేసే గ్లామరస్ ఫోటో షూట్స్ ని వ్యతిరేకించే వర్గం ఉంది. మెగా ఫ్యామిలీ అమ్మాయి అంటే మా అమ్మాయినే... మీరు ఇలా చేయవద్దని నిహారికకు సలహాలు ఇస్తున్నారు. 

 

77

నిహారిక మాత్రం ఒక గ్లామరస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. నిహారికను ప్రోమోట్ చేసి ఆమె స్టార్ అయ్యేలా మెగా ఫ్యామిలీ చేయలేదు. అదే సమయంలో ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చేయకుండా ఆపలేరనే వాదన మొదలైంది. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక అమ్మాయి నచ్చిన కెరీర్లో ముందుకు వెళితే తప్పేంటని నిహారికకు మద్దతు తెలిపేవారు కూడా ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories