మా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి, పెళ్లి తరువాత నిహారిక మాట్లాడడం లేదు

First Published Jan 24, 2021, 7:44 AM IST

మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తాజా ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు,పవన్ లతో తనకు అభిప్రాయ బేధాలున్నాయని, అలాగే పెళ్లి తరువాత నిహారిక పెద్దగా మాట్లాడం లేదన్నాడు. ఇక వరుణ్  పెళ్లి గురించి కూడా నాగబాబు స్పష్టత ఇచ్చాడు. 
 

చిరంజీవి మెగాస్టార్ గా వెండితెరపై దూసుకుపోతుండగా... పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు చేస్తూ ముందు వెళుతున్నారు. వీరిద్దరి మధ్యలో ఉన్న నాగబాబు మాత్రం బుల్లితెరపై సత్తా చాటాలని చూస్తున్నారు. జబర్ధస్త్ జడ్జ్ గా సూపర్ పాప్యులర్ అయిన నాగబాబు.. ఆ రంగంలోనే విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined
జబర్ధస్త్ నుండి బయటికి వచ్చిన నాగబాబు అదిరింది, బొమ్మ అదిరింది అనే రెండు కామెడీ రియాలిటీ షోలను నిర్వహించారు. కారణం ఏదైనా ప్రస్తుతం ఈ రెండు షోలు ముగిసినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన యూట్యూబ్ ఛానల్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తున్నారు.
undefined
ఆ విషయం పక్కన పెడితే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  నాగబాబు తన కుటుంబం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మెగా బ్రదర్స్  గా తమ మధ్య ఉండే అనుబంధాన్ని ఆయన తెలియజేశారు.
undefined
మా ముగ్గురు అన్నదమ్ముల మధ్య కొన్ని విషయాలలో అభిప్రాయ బేధాలు ఉన్నాయి. నా నిర్ణయాన్ని చిరంజీవి, పవన్ కళ్యాణ్ విభేదించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అన్నయ్య చిరంజీవి ఆలోచనలను పవన్ కళ్యాణ్, నేను విభేదించిన పరిస్థితులు కూడా ఉన్నాయి.
undefined
ఐతే అభిప్రాయ బేధాలు ఉన్నా మా మధ్య ఉండే ప్రేమ మాత్రం కొంచెం కూడా తగ్గదు. ఒక విషయంపై మా ఆలోచనలు వేరైనా కానీ, అన్నదమ్ములుగా ఆ ప్రేమ, అనుబంధం మాత్రం కొంచెం కూడా తగ్గవు అన్నారు.
undefined
అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు మా పిల్లలు కొనసాగిస్తున్నారని నాగబాబు అన్నారు. కజిన్స్ అయిన చరణ్, వరుణ్, ధరమ్ తేజ్, నిహారిక చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి ఒకరు మద్దతుగా నిలబడతారు. అది అన్నయ్య చిరంజీవి నుండి నేర్చుకున్నారని నాగబాబు అన్నారు.
undefined
ఇక నిహారిక గురించి యాంకర్ అడుగగా... ఆడపిల్లంటే ఏ తండ్రికి అయినా ఇష్టమే, నిహారిక అంటే నాకు ఇంకా  పిచ్చి. నాకు ఆడపిల్ల కావాలని ఎంతో కోరుకుంటే నిహారిక పుట్టింది. నిహారిక నేను బెస్ట్ ఫ్రెండ్స్ వలె ఉంటాము. అయితే పెళ్లి తరువాత నిహారిక గతంలో వలె ఎక్కువగా మాట్లాడం లేదని అన్నారు.
undefined
ఇక వరుణ్ పెళ్లి విషయానికి వస్తే... అది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా అనే తేడా ఏమీ ఉండదు. అన్నివిధాలా వరుణ్ కి తగిన అమ్మాయా కదా అని చూస్తాం. అమ్మాయి మంచిది అయితే చాలని ఆయన అన్నారు.
undefined
click me!