మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర నుంచి లేటెస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా ముందుగానే చిత్ర యూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ అయింది. చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ గ్లింప్స్ ని తీసుకువచ్చారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రం ఆలస్యం అవుతుండడానికి కారణాన్ని స్వయంగా చిరంజీవి వివరించారు. సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ ఉంటాయని, వాటిని అద్భుతంగా తీర్చిదిద్దడం కోసమే టైం పడుతోంది అని చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు.
25
గ్రాఫిక్స్ ని సీరియస్ గా తీసుకున్న టీమ్
చెప్పినట్లుగానే కొద్దిసేపటి క్రితమే విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ అయింది. గతంలో విశ్వంభర టీజర్ రిలీజ్ అయినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దానిని చిత్ర యూనిట్ బాగా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. లేటెస్ట్ గ్లింప్స్ లో గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. విశ్వంభర లోకాన్ని డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ చూపిస్తున్న విధానం అదిరిపోయింది.
35
విశ్వంభర లోకంలో అసలేం జరిగింది ?
విశ్వంభర లోకంలో అసలేం జరిగింది అని చిన్న పాప అడిగే వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ మొదలవుతుంది. వెంటనే విశ్వంభర లోకంలో భారీ తేలు లాంటి ఆకారాన్ని చూపించారు. విజువల్ గా ఆ షాట్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. విశ్వంభరలో జరిగిన అరాచకాన్ని ఓ వ్యక్తి వివరించే ప్రయత్నం చేస్తాడు. ఒకడి స్వార్థం అంతులేని యుద్ధంగా మారిందని, మరణశాసనాన్ని రాసిందని, భయాన్ని కలిగించిందని తెలుపుతాడు.
ఆ లోకంలో ఒక సమూహం ఒక వీరుడి కోసం ఎదురుచూస్తున్నారని.. ఆగని యుద్ధాన్ని అతడొచ్చి ముగిస్తాడని నమ్మకంతో ఉన్నారని చెబుతాడు. ఎవరతను అని పాప అడిగినప్పుడు చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. ముందు నుంచి చూప్పిస్తున్న హనుమాన్ విగ్రహం వద్ద చిరంజీవి శత్రువులతో పోరాడుతూ ఊచకోత కోస్తున్నాడు.
55
నెగిటివిటీ తొలగిపోయేలా గ్లింప్స్
ఓవరాల్ గా ఈ గ్లింప్స్ తో దర్శకుడు వశిష్ఠ కథ గురించి హింట్స్ ఇచ్చేశారు. విశ్వంభర లోకానికి వెళ్లి చిరంజీవి చేసే పోరాటమే ఈ చిత్రం. అయితే అక్కడికి ఎందుకు వెళ్ళాడు ? ఎలా వెళ్ళాడు అనేది కథలో ఆసక్తికరం. గతంలో విశ్వంభర టీజర్ వల్ల వచ్చిన నెగిటివిటీ తొలగిపోయేలా ఈ గ్లింప్స్ ఉంది. కీరవాణి అందించిన బీజీయం కూడా చాలా బావుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మౌని రాయ్ స్పెషల్ సాంగ్ లో నటించింది.