రాజీవ్ కనకాల దశాబ్దాలుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల ఎందరో నటీనటులకు ఓనమాలు నేర్పించిన గురువు. చిరంజీవి కూడా కెరీర్ బిగినింగ్ లో దేవదాస్ కనకాల ఫిలిం స్కూల్ లో నటనలో మెళుకువలు నేర్చుకున్నారు. రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
DID YOU KNOW ?
2026లో మెగాస్టార్ నుంచి 2 సినిమాలు
వచ్చే ఏడాది చిరంజీవి నుంచి రెండు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతికి చిరంజీవి మెగా 157 చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. అదే విధంగా 2026 సమ్మర్ లో విశ్వంభర మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
25
డూప్ లేకుండా ప్రాణాలకు తెగించిన చిరంజీవి
ఒకసారి చెన్నైలోని అట్లాంటిక్ హోటల్ వద్ద చిరంజీవి దొంగ సినిమా షూటింగ్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళాను. హోటల్ టాప్ పై ఫైట్ సీన్ జరుగుతోంది. చిరంజీవి పిట్టగోడపై నిలబడి బ్యాలెన్స్ చేస్తూ ఫైట్ చేయాలి. అప్పట్లో పెద్దగా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. కొంచెం తేడా జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా చిరంజీవి డేర్ గా ఆ సీన్ లో నటించారు. తాను దగ్గరుండి ఆ సీన్ ని చూసినట్లు రాజీవ్ కనకాల తెలిపారు.
35
ఆ మూవీ చూపించమని రాజీవ్ ని అడిగిన చిరంజీవి
నేను ఆ టైంలో చిన్న పిల్లాడిని. చూస్తుంటేనే టెన్షన్ గా అనిపించింది అని రాజీవ్ కనకాల తెలిపారు. తాను నటించిన ‘ఎ ఫిలిం బై అరవింద్’ మూవీ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారితో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది అని రాజీవ్ కనకాల తెలిపారు. ఎ ఫిలిం బై అరవింద్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒకసారి ఆయన్ని అనుకోకుండా డబ్బింగ్ థియేటర్ లో కలిశాను. ఏవమ్మా రాజీవ్.. నాకు ఎ ఫిలిం బై అరవింద్ మూవీ చూపించవా అని అడిగారు. భలేవారు సార్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి.. నేను షో ఏర్పాటు చేస్తాను అని అన్నాను.
వెంటనే ఆయన తన మేనేజర్ నంబర్ ఇచ్చారు. మేనేజర్ ని అడిగితే సార్ బిజీగా ఉన్నారని చెప్పారు. ఆ రోజు రాలేదు. అయినా చిరంజీవి వచ్చి నీ సినిమా ఎందుకు చూస్తాడు అని అంతా అన్నారు. కానీ మరుసటి రోజు లేట్ అయినా సాయంత్రం ఆయనే గుర్తుపెట్టుకుని మరీ వచ్చి తన చిత్రం చూసినట్లు రాజీవ్ కనకాల తెలిపారు.
55
ఇండస్ట్రీలో గ్రూపులు ఉండవు కానీ..
ఇండస్ట్రీలో గ్రూపులు ఉంటాయా ? ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటిస్తే మరో ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటించడం కుదరదా అనే ప్రశ్నకి కూడా రాజీవ్ సమాధానం ఇచ్చారు. తాను ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాల్లో నటించినట్లు రాజీవ్ తెలిపారు. అదే విధంగా మెగా ఫ్యామిలిలో అల్లు అర్జున్, రాంచరణ్ లతో కూడా నటించాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో నటించే అవకాశం రాలేదు. ఒక ఫ్యామిలీ కి చెందిన హీరోలతో నటిస్తే మరో ఫ్యామిలీతో నటించకూడదు అనేది లేదు. కానీ వారి కింద ఉన్న వారు మాత్రం చాలా హడావిడి చేస్తారు అని రాజీవ్ కనకాల తెలిపారు.