మెగా 157 వీడియో లీక్, చిరు కూతురు సుస్మితా కొణిదెల స్ట్రాంగ్ వార్నింగ్

Published : Jul 19, 2025, 04:31 PM IST

మెగా 157 చిత్రానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు లీక్ కావడంపై చిత్ర యూనిట్ స్పందించింది. చిత్ర నిర్మాతలు సుస్మితా కొణిదెల, సాహు గారపాటి అధికారికంగా హెచ్చరిక జారీ చేశారు. 

PREV
15

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకటి విశ్వంభర కాగా మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157. విశ్వంభర షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం మెగా 157 షూటింగ్ కేరళలో జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తొలిసారి చిరంజీవి నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

25

ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. సైరా, గాడ్ ఫాదర్ తర్వాత ఆమెకి చిరంజీవితో ఇది హ్యాట్రిక్ మూవీ. ఇటీవల కాలంలో షూటింగ్ లొకేషన్స్ నుంచి లీకులు అనేది కామన్ గా మారిపోయింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నప్పుడు లీకులు జరగడం దర్శక నిర్మాతలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు తప్పడం లేదు. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల కూడా ఒక నిర్మాత.

35

తాజాగా చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రాన్ని సంబంధించిన షూటింగ్ వీడియోలు, ఫోటోలు లీకై సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనితో చిత్ర నిర్మాతలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఇలా అనధికారికంగా మెగా 157 చిత్రానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీస్తే లీగల్ గా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుస్మితా కొణిదెల కలసి నిర్మిస్తున్నారు.

45

వీరిద్దరూ కలసి అధికారిక ప్రకటన చేస్తూ.. 'మెగా 157 చిత్రానికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్ర యూనిట్ అనుమతి లేకుండా సెట్స్ లో ఇలా వీడియోలు, ఫోటోలు తీయవద్దని కోరుతున్నాం. ఇలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. లీక్ అయిన కంటెంట్ ని ఎవరూ షేర్ చేయవద్దు. మెగా 157 చిత్రం కోసం టీం మొత్తం ఎంతో కష్టపడి పనిచేస్తోంది. ఇలా వీడియోలు లీక్ చేసి కష్టపడి పనిచేస్తున్న టీంని బాధపెట్టవద్దు' అని కోరారు.

55

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో చిరంజీవి డ్రిల్ మాస్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార టీచర్ పాత్రలో కనిపిస్తారట. వీరి మధ్య సన్నివేశాలు ఫన్నీగా, రొమాంటిక్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'శివ శంకర వరప్రసాద్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుసమాచారం. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీకి భీమ్స్ సంగీత దర్శకుడు.

Read more Photos on
click me!

Recommended Stories