ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో `గుడుంబా శంకర్` చిత్రంలో నటించింది. ఈసినిమా పరాజయం చెందినా, ఇందులో పవన్‌తో మీరా కెమిస్ట్రీ, రొమాన్స్ బాగా పండింది. అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో `భద్ర`తో సూపర్ హిట్‌ని అందుకుంది. గోపీచంద్‌తో `రారాజు`, బాలయ్యతో `మహరథి`, `యమగోల మళ్లీ మొదలైంది`, రవితేజతో `గోరింటాకు`, `మా ఆయన చంటి పిల్లాడు`, `బంగారుబాబు`, `అ ఆ ఇ ఈ`, `ఆకాశ రమణ` వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె `మోక్ష` అనే సినిమా చేసింది. చివర్లో ఆమె చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి.