అందుకే పవన్ కళ్యాణ్ రియల్ హీరో.. సనాతన ధర్మంపై 'బంగారం' హీరోయిన్ కామెంట్స్

Sreeharsha Gopagani | Published : Sep 9, 2023 3:12 PM
Google News Follow Us

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారం చిత్రంలో నటించిన హీరోయిన్ మీరా చోప్రా వరుసగా ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతోంది. 

16
అందుకే పవన్ కళ్యాణ్ రియల్ హీరో.. సనాతన ధర్మంపై 'బంగారం' హీరోయిన్ కామెంట్స్

ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉదయనిధి కామెంట్స్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాని నిర్మూలించాలి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

26

ఉదయనిధి స్టాలిన్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అసలు ఉదయనిధి స్టాలిన్ ఎవరు ? తాతగారు కరుణానిధి చరిష్మా వల్ల హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు తండ్రి ముఖ్యమంత్రి కావడంతో మంత్రి అయ్యారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టాలిన్.. డెంగ్యూ, మలేరియా ఎలాగో.. సనాతన ధర్మం కూడా అంతే. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు. నిర్మూలించాలి అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.

36

ఈ కామెంట్స్ పై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారం చిత్రంలో నటించిన హీరోయిన్ మీరా చోప్రా వరుసగా ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతోంది. ఈ క్రమంలో మీరా చోప్రా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, హిందూ దేవుళ్ళపై జరుగుతున్న దూషణలపై గతంలో చేసిన వ్యాఖ్యలని మీరా చోప్రా పోస్ట్ చేసింది. 

Related Articles

46

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఇంప్రెస్ అయిన మీరా చోప్రా.. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అయ్యాడంటే అందుకు కారణం ఇదే అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గతంలో పవన్ చేసిన సనాతన ధర్మానికి సంబంధించిన ప్రసంగం ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఒక వేళ అలా విమర్శిస్తున్నారు అంటే మీ అజెండాలు వేరే ఉన్నాయి అని అర్థం. 

56

సెక్యులరిజం పేరుతో సనాతన ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవతలపై దూషణలకు దిగడం మంచిది కాదు అని పవన్ హెచ్చరించారు. జీసెస్ ని, అల్లా గురించి ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడాలంటే చాలా భయపడతారు. కానీ హిందూ దేవుళ్ళని మాత్రం సులభంగా దూషిస్తారు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోపై మీరా చోప్రా ప్రశంసలు కురిపించింది. 

66

ఉదయనిధి స్టాలిన్ కి కౌంటర్ గానే మీరా చోప్రా ఈ పోస్ట్ చేసింది. ఉదయనిధి స్టాలిన్ ఐక్యూ లెవల్స్ చాలా తక్కువ అని మీరా చోప్రా విమర్శించింది. అందుకే ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు అంటూ మీరా చోప్రా.. ఉదయనిధి పై విరుచుకుపడుతోంది. 

Read more Photos on
Recommended Photos