
ఎపిసోడ్ ప్రారంభంలో మీతో గుడికి రావడం నాకు ఇష్టం లేదు అర్థం చేసుకో అంటాడు రాజ్. అర్థమైంది నాతో పెళ్లి ఇష్టం లేదు, నేను ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు నాకు సంబంధించిన ఏది మీకు ఇష్టం లేదు అంటుంది కావ్య. ఇష్టం లేదు అనే పదం వినటం నాకూ ఇష్టం లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి అంటుంది కావ్య. ఇకనుంచి నేను కూడా ఏది ఇష్టం లేదు అనను అందుకే ప్రతిదీ ఇష్టం లేదు అని నువ్వే మా తాతయ్యతో చెప్పు అంటాడు రాజ్. మీకు ఎన్ని తెలివితేటలు ఇప్పుడు చెప్తున్నాను వినండి.
ఈ వీరనారిని గుడికి రాకుండా ఎవరు ఆపలేరు అంటుంది కావ్య. నేను అందంగా ముస్తాబవ్వాలి అంటూ అతన్ని ఏడిపిస్తున్నట్లుగా మాట్లాడుతూ వెళ్ళిపోతుంది కావ్య. నువ్వెక్కడ దొరికావు అంటూ ప్రెస్టేట్ అవుతాడు రాజ్. మరోవైపు గుడికి వచ్చిన మీనాక్షి అమ్మవారికి దండం పెట్టుకుంటూ నా చెల్లెలు నా చేత ఆర్డర్ అని అబద్ధాలు ఆడించింది. ఇప్పుడు కూడా తనతో పాటు ఇక్కడికి తీసుకు వచ్చింది. ఏ సమస్య రాకుండా చూడు అని దండం పెట్టుకుంటుంది.
కావ్య తన అత్తారింట్లో సంతోషంగా ఉండాలని దండం పెట్టుకుంటుంది కనకం. ఇంతలో కనకానికి ఇటువైపు రా అని ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తుంది. తన అక్కవైపు తిరిగి అక్క అమ్మవారు నన్ను పిలిచింది విన్నావా అని అనగా పిలిచింది అమ్మవారు కాదు పక్కన ఎవరో పిలుస్తున్నట్టున్నారు అని అక్కడికి వెళ్లి చూసేసరికి స్వప్న మారువేషంలో అమ్మవారి లాగా తయారయ్యి జుట్టును విరబోసుకొని చెట్టు కింద కూర్చుంటుంది.
మీ బతుకులు బాగుంటాయి సంతోషంగా ఉంటారు అని అంటుంది. మీరు ఎవరి గురించి చెప్తున్నారు అమ్మ అని కనకం అనగా.. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఎవరికి ఉన్నారో వాళ్లే అని అంటుంది స్వప్న. ఛీ నాకు ముగ్గురు పిల్లలు లేరు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని కనకం అనగా లేదు నువ్వు అబద్దం చెప్తున్నావు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మొదటి కూతురు వెళ్ళిపోయింది. నీ మొదటి కూతురు నేను నీకు ఇచ్చిన వారం నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
తనే నీకు అష్టైశ్వర్యాలు తెస్తుంది అని అనగా ఆ మాటలు విన్న కనకం ఒకేసారి పూనకాలు వచ్చిన దానిలా ప్రవర్తించి జుత్తు వీరబోసుకొని మీరు దాని గురించి నాకు చెప్పొద్దమ్మా ఇంటి నుంచి లేచిపోయిందే కాక మా అక్క నగలన్నీ తీసుకొని వెళ్ళిపోయింది పాపం మా అక్క గిల్టు నగరం వేసుకుంటుంది అని అంటుంది. ఇక కనకం మీనాక్షి ఇప్పుడు దాని గురించి ఎందుకు లేవే అని అంటుంది. అలా కాదక్కా పాపం నువ్వు ఎంత కష్టపడ్డావు అది బంగారం లాంటి సంబంధాన్ని వదులుకొని పారిపోయింది.
ఇప్పుడు కావ్య అంత మంచి కుటుంబంలో కి వెళ్ళింది. ఇప్పుడు కొన్ని నష్ట జాతకాల గురించి మాట్లాడకపోతే నే మంచిది అని పూనకాలు వచ్చినదాన్లో అరుస్తూ ఇదంతాటికీ కారణం నువ్వేనమ్మ నాకెందుకు అలాంటి కూతుర్ని ఇచ్చావు అని పక్కనున్న త్రిశూలం పట్టుకొని స్వప్న వైపు దాడి చేయబోతుండగా.. మీనాక్షి ఆపి అమ్మ నువ్వు ఇక్కడి నుంచి మాయమైపో లేకపోతే మీకే ప్రమాదం అసలకే పూనకాలు వచ్చిన దానిలా మా చెల్లి ప్రవర్తిస్తుంది అని అనగా భయపడిన స్వప్న అక్కడి నుంచి పారిపోతూ మీ పెద్ద కూతురు చాలా మంచిదమ్మా తనని వదలొద్దు తను బంగారం అని చెప్పి వెళ్ళిపోతుంది.
స్వప్న వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి కనకాన్ని చంప మీద కొడుతుంది ఏమైంది. అక్క అని కనకం అనగా స్వప్న పేరు వినగానే పూనకాలు వచ్చిన దానిలా ప్రవర్తిస్తున్నావు అని అని అంటుంది మీనాక్షి ఇంతలో అదే గుడికి రాజ్ కుటుంబ సభ్యులు అందరూ వస్తారు దాన్ని చూసిన మీనాక్షి ఒసేయ్ కనకం నువ్వు నన్ను కావాలనే ఇక్కడికి వచ్చి అడ్డంగా ఇరికించేసావు కదా ఇప్పుడు నేను ఇరికిపోయాను నీతో పాటు నేను కూడా తిట్లు తినాలి అనుకుంటున్నావా అని అనగా ఏమైంది అక్క అని అంటుంది కనకం. చూడు ఎవరొచ్చారో అని మీనాక్షి కావ్య వాళ్ళ వైపు చూపిస్తుంది. వాళ్లని చూసి ఆనంద పడుతూ ఉంటుంది కనుక ఇప్పుడు ఆనందపడడానికి ఇది సమయం కాదు ఇక్కడి నుంచి అలా తప్పించుకోవాలో ఆలోచించు గుడికి వస్తున్నప్పుడు తుమ్ము వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఏదో కీడు జరిగిందని నేను గుడికి వచ్చాను గుడి బయట చేసేలా ఉన్నావు ఇక్కడి నుంచి తప్పించుకుందాం పద అని చెప్పి అక్కడ నుంచి వాళ్లకు కనబడకుండా తప్పించుకుంటారు పూజారి దగ్గరికి వచ్చి అర్చన చేయించమని అంటారు.
కొత్తగా పెళ్లయిన దంపతులు మొదటిసారి గుడికి వచ్చారు బ్రహ్మముడి కట్టుకొని ప్రదక్షిణాలు తిరగడం అమ్మ అని పంతులుగారు అనగా అమ్మ అర్చన మాత్రమే చేయుద్దాం ఇంకేమీ వద్దు అని అంటాడు రాజ్ పక్కనే ఉన్న సీతారామయ్య పంతులుగారు ఏం చెప్తే అలా చేయండి అని అనకా ఇద్దరికీ బ్రహ్మముడి కట్టి ప్రదక్షిణానికి వెళ్లండి అని అంటారు పంతులుగారు రాజ్ త్వరగా నడుస్తూ ఉంటాడు నెమ్మదిగా నడవండి అని అంటుంది కావ్య.
నా అడుగుజాడల్లోనే నడుస్తాను అన్నావు కదా అని అడుగు ఇప్పుడు అని రాజు అనగా కావాలని కింద పడిపోయినట్టు నటిస్తుంది కావ్య ఏమైంది అని అందరూ కంగారుపడి కావ్య దగ్గరికి రాగా కాలు అయితే ప్రదక్షిణాలు ఆపేద్దాము అని రాజ్ అంటాడు అలా ఎలా ఆపేస్తాము భార్యని రెండు చేతుల మీద మోస్తూ భర్త వెళ్లి ప్రదక్షిణాలు తిప్పాలి అని పూజారి గారు అంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తరువాయి భాగంలో ఒకరికొకరు ప్రసాదం తినిపించుకోండి అని కావ్య వాళ్లకి ప్రసాదం ఇవ్వగా ఒకరి చేతిలో ఒకరు ప్రసాదం గిన్నె పెట్టి తప్పించుకుంటారు. ఒక మూలన ఉన్న స్వప్న ఇదంతా చూసి వెనకనుంచి వచ్చి వాళ్ళ మధ్యలోకి దూరి ప్రసాదాన్ని కింద పడేలా చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.