Intinti Gruhalakshmi: ఒక్కటైన దివ్య, విక్రమ్.. దివ్య ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేసిన లాస్య?

First Published Apr 1, 2023, 10:09 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో దివ్య విక్రం కి ఫోన్ చేసి నేను బయలుదేరుతున్నాను అనగా సరే అని అంటాడు విక్రమ్. అప్పుడు దివ్య బయటకు వెళ్లి ఝాన్సీ నేను బయటికి వెళ్లి వస్తాను అనగా సరే మేడం అక్కడ చెక్కులు ఇస్తున్నారు పనిలో పనిగా తీసుకుని వెళ్ళండి అనడంతో దివ్య అక్కడికి వెళుతుంది. అక్కడ విక్రమ్ ని చూసి ఒకసారగా షాక్ అవుతుంది దివ్య. దివ్య ని చూసి విక్రమ్ కూడా షాక్ అవుతాడు. మరోవైపు నందు పనిచేసుకుంటూ తులసి అక్కడికి వచ్చి బిజినెస్ బాగానే జరుగుతుందా, నందగోపాల్ గారు అనడంతో బాగానే జరుగుతుంది అని అంటాడు.

ఇంతలో పరంధామయ్య అక్కడికి రావడంతో కాఫీ కావాలా మావయ్య అని తులసి అడగగా కాఫీ కాదు దివ్యకు పెళ్లి సంబంధం తీసుకుని రండి అని లాస్య అక్కడికి వస్తుంది. లాస్య అని నందు అనడంతో లాస్య అనడం కాదు ముందు దివ్య కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొని రండి. మొన్న నేను ఒక పెళ్లి సంబంధం తీసుకుని వస్తే కాదన్నారు కనీసం మీరైనా ట్రైల్ చేయాలి కదా అనగా ఇప్పుడు నీ సమస్య ఏంటి లాస్య అని తులసి అనడంతో సమస్య కాదు తులసి దివ్య కోసం ఒక సంబంధం చూడాలి ఆ బాధ్యత లేదా అనడంతో అంటే మేం పట్టించుకోవడం లేదు అంటున్నావా లాస్య అని అంటుంది తులసి.
 

దానికి సంబంధం దొరకాలి కదా అనగా వెతికితే దొరుకుతాయి అందుకే నేను ఒక మంచి సంబంధం తీసుకుని వచ్చాను అనడంతో రెండో పెళ్లి వాడా మూడో పెళ్లి వాడా లేకపోతే ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్నవాడా అని నందు వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు పరందామయ్యా నువ్వు ఆగరా తను చెప్పేది చెప్పు నువ్వు అని అంటాడు. అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి లాస్య అనడంతో కోట్లకు అధిపతి నాలుగు తరాలు ఐనా కూర్చొని తినవచ్చు. హాస్పిటల్ ఉంది అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అవన్నీ సరే ముందు అబ్బాయి చదువుకున్నాడా అని నందు అడగగా అబ్బాయి ఏమి చదువుకోలేదు కానీ ఆస్తి పాస్తులు బాగానే ఉన్నాయి అని లాస్య అనడంతో అట్లయితే ఈ పెళ్ళికి నేను అసలు ఒప్పుకోను అని అంటాడు నందు.
 

మరొకవైపు దివ్య విక్రమ్ ఒక హోటల్లో కలుసుకోగా ఇంతవరకు నమ్మకద్రోహం అనే పదం విన్నాను మొదటిసారి చూస్తున్నాను. నన్ను ఇంత మోసం చేస్తారా ఎంతో గుడ్డిగా నమ్మాను అనడంతో దివ్య గారు ఒక్క నిమిషం నేను చెప్పే మాటలు వినండి చెప్పిన తర్వాత మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను అని విక్రమ్ అనడంతో ఇన్ని రోజులు మీరు చెప్పిన మాటలే విన్నాను ఇకపై మీరు చెప్పిన మాటలు నేను వినదల్చుకోలేదు అని అంటుంది దివ్య. నేను ఎవరిని అంత గుడ్డిగా నమ్మను అలాంటిది నేను మిమ్మల్ని ఒకటికి పది సార్లు నా మనసును విసిగించి మీతో ప్రేమలో పడ్డాను కానీ మీరు ఇలా చేస్తారని ఊహించలేదు అని విషయం అపార్థం చేసుకుంటూ మాట్లాడుతుంది.
 

విక్రమ్ ఏడుస్తూ మీరు అలా మాట్లాడకండి దివ్య గారు గుండె తట్టుకోలేదు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి అని అంటాడు. ఇంకా ఎవరిని మోసం చేయడానికి ఈ దొంగ కన్నీరు కారుస్తున్నారు అని అంటుంది దివ్య. అప్పుడు అందరూ ఉన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఇక నుంచి వెళ్లిపోండి అనే దివ్య గెట్టిగా అరుస్తుంది. అప్పుడు విక్రమ్ కూల్ గా మాట్లాడుతూ నేను ఇకనుంచి వెళ్లిపోవడానికి నేను మిమ్మల్ని ప్రేమించలేదు లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని అనుకున్నాను అని అంటాడు. నామీద కోపంగా ఉంటే ఒక దెబ్బ కొట్టండి తిట్టండి అంతేగాని నన్ను వెళ్లిపోమని మాత్రం చెప్పకండి దివ్య గారు అని అంటాడు.
 

నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను కానీ నిన్ను ఇలా తిట్టాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు నా మీద నాకే కోపంగా ఉంది ఏడుపొస్తుంది నాకు మనసులో బాధగా ఉంది అని అంటుంది దివ్య. సరే దివ్య గారు నేను ఎన్ని చెప్పినా మీరు వినే స్టేజ్ లో లేరు. నేను ఏం చెప్పినా కూడా మీరు అపార్థం చేసుకుంటారు. నేను ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్లి పోతున్నాను. కార్ ఎక్కి వెళ్ళిపోయే లోపు నా మీద మీకు నమ్మకం ఉంది ప్రేమ కలిగితే ఒక్కసారి విక్రమ్ అని పిలవండి. లేదంటే పిలవకండి నేను నా కారు ఎక్కి నా దారిన నేను వెళ్ళిపోతాను. జీవితంలో నా మొఖం నీకు చూపించను అని నాతో దివ్య షాక్ అవుతుంది. అప్పుడు దివ్య విక్రమ్ ఇద్దరూ ఏడుస్తూ తలా ఒకవైపు వెళ్ళిపోతారు.
 

విక్రమ్ దివ్యతో గడిపిన క్షణాలు దివ్యతో మాట్లాడిన మాటలు గుర్తుతెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. దివ్య ఒక చోట నిలబడి గట్టిగా విక్రమ్ అని పిలవడంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తాడు విక్రమ్. దివ్య కూడా పరిగెత్తుకుంటూ విక్రం దగ్గరికి వెళ్లి హత్తుకోవడంతో విక్రమ్ కూడా దివ్యని హత్తుకుంటాడు. మరోవైపు నందు నేను అబ్బాయి చదువుకోలేదు అని ఈ సంబంధం వద్దు అనడం లేదు నువ్వు తెచ్చిన సంబంధం అని నేను వద్దంటున్నాను అని అంటాడునందు. మీ కూతురు దివ్య విక్రం ని ఇష్టపడింది అన్న కూడా మీరు ఓకే చెప్పరా అని అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ లాస్య అనడంతో మీ అమ్మాయి ఆ రాజ్యలక్ష్మి కొడుకు విక్రమ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.
 

ఈ విషయాన్ని నా నోటితో చెప్పకూడదనుకున్నాను కానీ దివ్య చెప్పేలా చేసింది అనడంతో నువ్వు ఎక్కడో పొరపాటు పడుతున్నావు లాస్య నా కూతురు నా దగ్గర ఎప్పుడు నిజాలు దాచదు అంటుంది. దివ్య అక్కడికి రావడంతో అందరూ దివ్య వైపు కోపంగా చూస్తుండగా ఏమైంది ఎందుకు అందరూ అలా కోపంగా చూస్తున్నారు అనడంతో అప్పుడు లాస్య నువ్వు దాచిపెట్టిన నిజాన్ని నేను బయట పెట్టేసాను నువ్వు విక్రం ప్రేమించుకుంటున్న విషయాన్ని చెప్పేసాను అనడంతో దివ్య షాక్ అవుతుంది. అప్పుడు లాస్య మీద సీరియస్ అవుతూ నా పర్సనల్ విషయాల్లో నిన్ను ఎవరు జోక్యం చేసుకోమని చెప్పారు. రాయభారం చేయమని నేను అడిగానా అని అంటుంది. అప్పుడు దివ్య తులసీతో మాట్లాడుతున్న నన్ను క్షమించు అమ్మ నిన్ను కావాలని మోసం చేయలేదు ఆ అబ్బాయి మనసులో నేను ఉన్నాను లేదో తెలుసుకోకుండా నీకు మాట చెబితే బాగోదు అందుకే ఈ విషయం దాచాను అని తులసిని  గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అవుతుంది దివ్య. పర్లేదు లేమ్మా అంతా నీ అదృష్టం ప్రకారం జరుగుతుంది అని అంటుంది తులసి.

click me!