Brahmamudi: తెలివితక్కువ తనంతో ఇబ్బందుల్లో పడ్డ మీనాక్షి.. అర్ధరాత్రి రిస్క్ తీసుకుంటున్న కావ్య?

Published : Jul 05, 2023, 08:48 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంటుంది. జైల్లో ఉన్న కూతురు కోసం తపన పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Brahmamudi: తెలివితక్కువ తనంతో ఇబ్బందుల్లో పడ్డ మీనాక్షి.. అర్ధరాత్రి రిస్క్ తీసుకుంటున్న కావ్య?

 ఎపిసోడ్ ప్రారంభంలో పోలీస్ స్టేషన్ బయట దిగులుగా కూర్చున్న భర్తకి టిఫిన్ తీసుకువస్తుంది కనకం. ఈ పరిస్థితుల్లో ఎలా తినమంటావు అని దిగులుగా అడుగుతాడు కృష్ణమూర్తి. నీకు షుగర్ కదా మందులు వేసుకోవాలి తప్పదు తిను అని భర్త చేతిలో టిఫిన్ పెడుతుంది కనకం.

29

  అంతలోనే మీనాక్షి వచ్చి మీ ఇంటికి కష్టాలు ఒక దాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి అని బాధపడుతుంది. నువ్వు వస్తావనుకోలేదు అంటుంది కనకం. కిడ్నాప్  కి అయితే రాను గాని కష్టాల్లో ఉంటే ఎందుకు రాను విడిపించుకుని వస్తాను అని స్టేషన్ లోపలికి వెళ్తుంది మీనాక్షి. మరోవైపు ఆఫీసు రూమ్ కి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు  రాజ్. ఆనందంగా ఉన్నట్లున్నారు అని కావ్య కూడా ఆనందపడుతుంది.
 

39

 అనుకున్న పని అయితే ఆనందంగానే ఉంటుంది ఇంతకీ రాత్రి ఏం జరిగిందో చెప్తాను అన్నావు కదా చెప్పు అంటాడు రాజ్. నేను చెప్పను అంటుంది కావ్య. అదేంటి ఆఫీస్ కి తీసుకు వస్తే చెప్తాను అన్నావు కదా ఇలా మాట తప్పుతావ్ ఏంటి అంటాడు రాజ్. మరి స్వప్నకు విషయంలో నా తప్పు లేకపోతే నన్ను భార్యగా స్వీకరిస్తానన్నారు కదా ఆ విషయంలో మీరు మాట తప్ప లేదా అని నిలదీస్తుంది కావ్య.
 

49

 నేను మాట తప్పేనేమో కానీ మోసగాడిని మాత్రం కాదు టైం అయింది పద ఇంటికి వెళ్దాం అని కావ్యకి చెప్పటంతో ఇద్దరూ బయటికి వస్తారు. మరోవైపు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి ఎస్ఐతో రూల్స్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ రచ్చ చేస్తుంది మీనాక్షి. ఎక్కువ చేస్తే మీరు కూడా  మీ అమ్మాయితో పాటు లాకప్ లో ఉండాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇవ్వటంతో కనకం ఆమెని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.
 

59

ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన రాజ్ తనకన్నా ముందు నడుస్తున్న భార్యతో ఎంత ఫాస్ట్ గా వెళ్లిన నేను డోర్ ఓపెన్ చేస్తేనే కార్లో కూర్చోవాలి అంటాడు రాజ్. అంటే ఇప్పుడు కారు మీది అని పొగరు చూపిస్తున్నారా నేను కావాలంటే ఎలాగైనా ఇంటికి వెళ్ళగలను అంటుంది కావ్య. అప్పుడే అటుగా ఒక ఆటో ఆగుతుంది. నేను ఆటోలో వెళ్లిపోతాను అంటుంది కావ్య. ఇప్పుడు ఇదంతా అవసరమా అంటాడు రాజ్.
 

69

 ఇదంతా నాతో పొగరుగా మాట్లాడక ముందు ఉండాలి  అని కావ్య పొగరుగా ఆటోలో వెళ్లిపోతుంది. దేని మీద వెళ్ళినా నువ్వు చివరికి ఇంటికే కదా రావాలి అనుకుంటాడు రాజ్. మరోవైపు బాధతో కూర్చున్న కనకం దంపతులని చూసి ఎలాగైనా అప్పుని విడిపించాలి అనుకుంటుంది మీనాక్షి. కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి లంచం ఆశ చూపిస్తుంది. కానిస్టేబుల్ ఆమెని ఎస్సై దగ్గరకు తీసుకువెళ్లి లంచం ఇవ్వాలని చూస్తుంది అని చెప్పడంతో ఇవ్వడం కూడా నేరమే అంటాడు ఎస్సై.
 

79

అతనికి తలవాచేలాగా జీవిత సత్యాలు చెప్తుంది మీనాక్షి. ముందు ఈవిడని బయటికి బయటికి గెంటయ్యండి తర్వాత నాకు డబల్ స్ట్రాంగ్ టీ చెప్పండి తల పగిలిపోతుంది అని ఫ్రెస్టేట్ అవుతాడు ఎస్సై. మీనాక్షి రాత్రిపూట ఎక్కడ ఉండటం ఎందుకు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు కనకం దంపతులు. మరోవైపు కిచెన్ లో వంట చేస్తుంటుంది కావ్య. తన చేతి వంట తినటం ఇష్టం లేక తనే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాడు. అది మాడిపోయి బొగ్గు అయిపోతుంది.

89

భోజనాలు దగ్గర కూర్చొని తన భోజనం చాలా బాగుంది తినే అదృష్టం లేదు అని కూరతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతుంది కావ్య. అప్పటికే మాడిపోయిన బ్రెడ్ ఆమ్లెట్ తినలేక ఇబ్బంది పడుతుంటాడు రాజ్. ఎందుకండీ అంతా ఇబ్బంది పడటం అసలే మీరు ఆకలికి ఆగలేరు ఉండడి వడ్డిస్తాను అంటుంది కావ్య. అంతలోనే అడుక్కునేవాడు రావడంతో భోజనం అంతా వాడికి ఇచ్చేస్తాడు రాజ్.
 

99

తరువాయి భాగంలో ఊపిరి అందక ఆవస్త పడుతూ ఉంటాడు రాజ్. ఆ హడావుడికి కావ్యకి మెలకువ వస్తుంది. ఇన్హేలర్ ఇస్తుంది కానీ అది ఖాళీ అయిపోవటంతో ఇబ్బంది పడుతున్న భర్తని తీసుకొని బయటికి వస్తుంది వాచ్మెన్ కి కారు డ్రైవ్ చేయడం రాదు అనడంతో తనే భర్తని వెనుక వెనకన కూర్చోబెట్టుకొని టు వీలర్ మీద హాస్పిటల్ కి వెళ్తుంది.

click me!

Recommended Stories