ఏపీలో షూటింగ్స్ చేయాలంటే కేసీఆర్ ని ఒప్పించాలి, కాళ్ళు పట్టుకుని అడుగుతా.. పోసాని షాకింగ్ కామెంట్స్

Published : Jul 05, 2023, 07:36 AM IST

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏ అంశం గురించి అయినా వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయన శైలే వేరు. అయితే అలా మాట్లాడి పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు.

PREV
16
ఏపీలో షూటింగ్స్ చేయాలంటే కేసీఆర్ ని ఒప్పించాలి, కాళ్ళు పట్టుకుని అడుగుతా.. పోసాని షాకింగ్ కామెంట్స్

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏ అంశం గురించి అయినా వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయన శైలే వేరు. అయితే అలా మాట్లాడి పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు. చాలా కాలం నుంచి పోసాని వైసీపీ, వైఎస్ జగన్ మద్దతు దారుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలపై సైతం పోసాని ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూస్తున్నాం. 

26

అయితే సీఎం జగన్.. పోసానిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళ్లాలని లేదా ఏపీలో కూడా షూటింగ్స్, సినిమా నిర్మాణాలు లాంటి కార్యకలాపాలు వేగవంతం చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ కార్యక్రమాలు, సినిమా నిర్మాణాలు మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. 

36

దీనిపై పోసాని కృష్ణ మురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్స్ చేయాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించాలి అని అన్నారు. తాను ఎలాగైనా కేసీఆర్ కాళ్ళు పట్టుకుని అడుగుదామనుకుంటున్నా అని పోసాని అన్నారు. ఏపీలో షూటింగ్స్ చేసుకుంటాం అని కేసీఆర్ ని అడిగితే.. తెలంగాణాలో మీకు స్థలాలు ఇచ్చాం కదా అని అంటారేమో. 

46

కానీ ఏపీలో అయితే ఉచితంగా సినిమా షూటింగ్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చిత్ర పరిశ్రమకి స్థలాలు ఇస్తాం ఇక్కడకి రండి అని అంటున్నారు. ఇది చిత్ర పరిశ్రమకి విచిత్రమైన పరిస్థితిగా మారిపోయింది. కటింగ్ , ఫిటింగ్ వ్యవహారం అని పోసాని అభివర్ణించారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సమస్య పరిష్కారం అవుతుంది. 

56

మనస్ఫూర్తిగా అడిగితే కేసీఆర్ ఏదో విధంగా సాయం చేస్తారనే అనుకుంటున్నా అని పోసాని అన్నారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎవరు ఉన్నా ప్రస్తుతం తెలంగాణ భవిష్యత్తు ఆయనతోనే ముడిపడి ఉందని అన్నారు. 

66

అలాగే నంది అవార్డుల గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సీఎం జగన్ తెలిపినట్లు పోసాని అన్నారు. త్వరలో ఆ ప్రక్రియ చేపడతాం అని పోసాని అన్నారు. గతంలో జరిగిన నంది అవార్డులు ఓ వర్గానికి చెందినవి మాత్రమే అని పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను 100 చిత్రాలకు రచయితగా పనిచేసినప్పటికీ ఒక్క చిత్రానికి కూడా నంది అవార్డు రాలేదని అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories