Actress Trisha
సౌత్ లో అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ బిగినింగ్ లో త్రిష వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా దూసుకుపోయింది. తమిళంలో కూడా రాణించింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల ప్రభావంతో త్రిష క్రేజ్ తగ్గింది. దీనితో త్రిష కొంతకాలం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో కెరీర్ నెట్టుకొచ్చింది.
Actress Trisha
అయితే త్రిష వ్యక్తిగత జీవితంలో గురించి గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. అదే విధంగా ఆమె నిర్మాతల కష్టనష్టాలతో సంబంధం లేకుండా ఎలా ప్రవర్తిందో అనే అంశాన్ని నిర్మాత గిరిధర్ మామిడిపల్లి వివరించారు. త్రిషపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
చాలా కాలంగా త్రిషతో సినిమా చేయాలనుకుంటూ ఉన్నా. ఒకసారి త్రిష డేట్లు కుదిరాయి. కానీ కథ లేదు. ఆ టైంలో త్రిష బాలయ్యతో లయన్ చిత్రం చేస్తోంది. ఒక సినిమా చేయాలి అని అడిగా. నీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయాలనుకుంటున్నట్లు త్రిషకి చెబితే ఒకే అంది. చాలా కథలు పంపించాం కానీ ఆమెకి నచ్చడం లేదు. డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఒక హర్రర్ కథతో వచ్చారు. అది త్రిషకి నచ్చింది.
వెంటనే సినిమా ప్రారంభించాం. త్రిషకి ఒక రెమ్యునరేషన్ అనుకుని ఆమెకి చెప్పాం. ఒప్పుకుంది. సినిమా మొదలయ్యాక కొన్ని రోజులు షూటింగ్ బాగానే జరిగింది. ఆ తర్వాత త్రిష, గోవర్ధన్ రెడ్డి వల్ల కష్టాలు మొదలయ్యాయి. సినిమాపై వాళ్ళు సరిగ్గా ఫోకస్ పెట్టలేదు. చాలా ఇబ్బందులు పడ్డా. సినిమా పూర్తవుతున్న టైంలో బిజినెస్ మొదలయింది. దీనితో గోవర్ధన్ రెడ్డి త్రిషకి చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి 10 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. కానీ మీకు మాత్రం తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు అని చెప్పాడు. దీనితో త్రిష గొడవ చేయడం మొదలు పెట్టింది. 10 కోట్ల బిజినెస్ చేసుకుంటూ నాకు 1 కోటి కూడా ఇవ్వకుంటే ఎలా అని అడిగింది.
ఆ టైంలో త్రిషకి అంత మార్కెట్ లేదు. సినిమాకి భారీ బడ్జెట్ అయింది. అది తిరిగి వస్తుందో లేదో కూడా తెలియదు. కోటి రూపాయలు ఇవ్వలేం. కావాలంటే తమిళ శాటిలైట్ హక్కులు ఇస్తాం అని చెప్పా. ఎంత బతిమాలినా వినలేదు. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీనితో నా జీవితమే తలక్రిందులు అయింది. త్రిషతో సినిమా చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడే నా జీవితం మారిపోయింది. దీనికి కారణం దర్శకుడు, త్రిష అంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు త్రిష తమిళంలో ఒక చిత్రం చేసింది. అది కూడా డిజాస్టర్ కావడంతో నాయకి సినిమాపై ప్రభావం పడింది అని నిర్మాత గిరిధర్ అన్నారు.