మీనా సాగర్
సౌత్‌లోనే కాదు, హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన మీనా, బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించింది. రజనీకాంత్‌ని అంకుల్ అని పిలిచే ఆమె, ఏకంగా ఆయన సరసనే సినిమాలు చేసి మెప్పించింది.
బాలనటి మీనా
1982 నుండి నేటి వరకు దాదాపు 43 సంవత్సరాలు సినీరంగంలో సాధించింది. శివాజీ గణేషన్ నటించిన “నెంజంగాల్” సినిమాతో మీనా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత “ఎంగేయో కేట్ట కురల్”, “అన్బుల్లా రజినీకాంత్” వంటి చిత్రాలలో రజినీకాంత్ తో కలిసి బాలనటిగా నటించింది. ఇది మీనాను మరొక స్థాయికి తీసుకెళ్ళింది.
మీనా సినిమాలు
తమిళంలో కెరీర్‌ని ప్రారంభించిన మీనా తెలుగులోకి `సరిపురం మొనగాడు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ కలిసి నటించింది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి వారితోనూ మూవీస్ చేసి మెప్పించింది. తిరుగులేని స్టార్‌గా ఎదిగింది.
మీనా సినీరంగంలో ఇన్ని సంవత్సరాలు రాణించడానికి ఆమె తల్లి కూడా ఒక కారణం. ప్రతి సినిమాను చూసి చూసి నటింపజేసేవారు. ఏ సినిమా చేయాలో, ఏది వద్దో చెప్పేవారు. దీనివల్ల కొన్ని మంచి సినిమాలు కూడా ఆమెకు చేజారిపోయాయి. అలా చేజారిపోయిన సినిమాల గురించి మీనానే చెప్పింది. అందులో ముఖ్యమైనది శివాజీ గణేషన్, కమల్ హాసన్ నటించిన `క్షత్రియ పుత్రుడు`(“దేవర్ మగన్) కూడా ఉంది. మరి ఇది ఎలా మిస్ అయ్యిందనేది చూస్తే.
మీనా కూతురు నైనిక
“దేవర్ మగన్” సినిమా ఎందుకు మిస్ అయ్యిందో మీనా వివరించింది. “దేవర్ మగన్` సినిమాకి మేకప్ టెస్ట్ బాగానే జరిగింది. ముఖానికి పసుపు రాసిన తర్వాత కూడా మేకప్ టెస్ట్ కోసం ఫోటోలు తీశారు. కానీ అది కమల్ హాసన్ కు ఏదో ఇబ్బంది కలిగించింది. అందుకే నాకు బదులుగా రేవతిని ఆ పాత్రకు ఎంచుకున్నారు” అని మీనా చెప్పింది.