డైరెక్ట్ ఓటీటీలోకి నయనతార మూవీ ? ఆ సినిమా ఏంటో తెలుసా?

Published : Jan 15, 2025, 05:07 PM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గతేడాది ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్‌లోకి రాలేదు. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇస్తుంది నయన్‌. 

PREV
14
డైరెక్ట్ ఓటీటీలోకి నయనతార మూవీ ? ఆ సినిమా ఏంటో తెలుసా?
నయనతార జవాన్ సినిమా

నయనతార సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. స్టార్‌ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. అంతేకాదు రెండేళ్ల క్రితం బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తూ ఏకంగా 1200కోట్ల హీరోయిన్‌ గా పేరుతెచ్చుకుంది. షారూఖ్‌ ఖాన్‌తో ఆమె `జవాన్‌` సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది ఎంత  పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే.  

24
నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్

గతేడాది నయనతార నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ మాత్రమే విడుదలైంది. ఇప్పుడు 'టెస్ట్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 

34
నయనతార టెస్ట్ సినిమా

శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్, కాళీ వెంకట్ నటించారు. ఈ మూవీ రిలీజ్‌ కి రెడీ అవుతుంది. అయితే ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రాబోతుందని సమాచారం. థియేటర్‌లోకి కాకుండా ఓటీటీలోనే విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

44
ఓటీటీలో టెస్ట్

జనవరి నెలాఖరులోపు 'టెస్ట్' ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన వస్తుందట. మరి ఎందుకు ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక నయనతార  ప్రస్తుతం `మన్నాంగట్టి సిన్స్ 1960', 'డియర్ స్టూడెంట్స్', 'టాక్సిక్', విష్ణు ఎడవన్ సినిమా, 'రాక్కాయి' వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

read  more: బాలకృష్ణ వంద కోట్ల సినిమాలు ఎన్నో తెలుసా? సీనియర్‌ హీరోల్లో బాలయ్య రేర్‌ ఫీట్‌

also read: నిధి అగర్వాల్ పై కాజల్‌ ఫ్యాన్స్ ట్రోల్స్.. కొంప ముంచిన `అందరికి నమస్కారం`.. క్లారిటీ ఏంటంటే?

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories