ఖుష్బూకి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన మీనా.. వెంకటేష్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ

Published : Jan 07, 2024, 01:41 PM IST

వెంకటేష్ సైంధవ్‌ చిత్రానికి బుల్లితెరపై కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈటీవీలో ప్రసారం అయ్యే సంక్రాంతి స్పెషల్ షోలో వెంకీ మెరిసాడు.

PREV
16
ఖుష్బూకి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన మీనా.. వెంకటేష్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

26

జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ నటించని జోనర్ చిత్రం ఇది. దీనితో సైంధవ్ చిత్రం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. ట్రైలర్ కూడా అదిరిపోవడంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. 

36

వెంకటేష్ సైంధవ్‌ చిత్రానికి బుల్లితెరపై కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈటీవీలో ప్రసారం అయ్యే సంక్రాంతి స్పెషల్ షోలో వెంకీ మెరిసాడు. అల్లుడా మజాకా అంటూ సాగే ఈ షో ప్రోమో తాజాగా విడుదలయింది. సంక్రాంతి ఈవెంట్ కాబట్టి ఒక రేంజ్ లో రచ్చ జరుగుతోంది. సీనియర్ నటీమణులు ఖుష్బూ, మీనా వెంకటేష్ తో కలసి రచ్చ రచ్చ వేసారు. 

46

అదే విధంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రోహిణి నవ్వులు పూయించారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మధ్య కామెడీ పంచ్ లతో ఈ ప్రోమో మొదలయింది. ఆ తర్వాత ఇద్దరూ ఖుష్భూ,మీనా లతో కొంటె వేషాలు వేశారు. మిమ్మల్ని తెలుగు చంటి లో చూడదని చాలా ఆనందంగా అనిపించింది అని సుడిగాలి సుధీర్ మీనాతో అంటే.. మిమ్మల్ని తమిళ చంటిలో చూడడం ఆనందంగా అనిపించింది అని హైపర్ ఆది ఖుష్బూతో అన్నాడు. మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడడానికి చాలా చిరాగ్గా ఉందని ఖుష్బూ కౌంటర్ ఇచ్చింది. 

56

వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాక అసలు రచ్చ మొదలయింది. వెంకటేష్ తన పక్కనే కూర్చోవాలి అని మీనా అంటే లేదు నా పక్కనే కూర్చోవాలి అని ఖుష్భూ అన్నారు. దీనితో ఇద్దరి మధ్య రచ్చ రచ్చ జరిగింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సూపర్ హిట్ జోడి మాది అని మీనా అన్నారు. వెంకీ జర్నీ మొదలింది నాతో అని ఖుష్బూ అన్నారు. స్టార్ అయింది అలాగే మీ కాంబినేషన్ ఎండ్ కూడా అయిపోయింది అంటూ మీనా ఖుష్బూకి కౌంటర్ ఇచ్చారు. 

66

వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే వెంకటేష్ అయోమయంగా ముఖం పెట్టడం నవ్వులు పూయించింది. ఆ తర్వాత కూడా వెంకటేష్ , ఖుష్బూ, మీనా, హైపర్ ఆది, సుధీర్ మధ్య సరదా సంభాషణలు జరిగాయి. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరిద్దరూ వెంకీ వెంకీ అని ఒక్కసారి పిలవండి అని సుధీర్ మీనా, ఖుష్బూతో అన్నారు.అంత ఓవరాక్షన్ వద్దు జస్ట్ వెంకీ అంటే చాలు అని వెంకటేష్ సుధీర్ కి కౌంటర్ ఇచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories