కొరియన్ సిరీస్ చూడటం ఇప్పుడు ట్రెండ్. కొందరు కొరియన్ సంస్కృతికి అలవాటు పడ్డారు. కొరియన్ భాషలో హలో చెప్పడం నుండి కొరియన్ వంటకాల హోటల్ తెరవడం వరకు అభిమానులు పెరుగుతున్నారు.
కొందరికి కొరియన్ సినిమా, సిరీస్‌లు టైం పాస్ కాదు. అంతకు మించి. ఎందుకంటే అది వారి భావాలకు అవి చాలా దగ్గరగా ఉంటాయి. ఇతర సినిమాల కంటే కొరియన్ సిరీస్, కె-పాప్ చూసే వారికి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జీవిత సమస్యల నుండి, ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి కొందరు కొరియన్ సిరీస్‌లను చూస్తారు. ఈ సిరీస్‌లు మనసులోని బాధను తగ్గించడంతో పాటు.. ఆలోచనశక్తిని ఈ సిరీస్ ప్రోత్సాహిస్తుంది. కొరియన్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో వారు ఎంచుకునే కథ కూడా ఒక ముఖ్యమైన అంశం.
కొరియన్ సిరీస్‌ల పాత్రలు ప్రత్యేకమైనవి. మైమరిపించే స్క్రీన్ ప్లే .. హాస్యం, కంటికి ఇంపుగా ఉండే అందం ఇలా అనేక విషయాలు ఈసిరిస్ వైపు ఆకర్షించడానికి కారణంగా మారుతున్నాయి. ది డైలీ గార్డియన్ నివేదిక ప్రకారం, కొరియన్ సిరీస్‌లలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అంశాలు ఉన్నాయి.
కొరియన్-అమెరికన్ థెరపిస్ట్ జీనీ సాంగ్, కె-డ్రామాలు ప్రేక్షకుల భావాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఆందోళన, నిరాశను చిత్రీకరించే విధానం ప్రజలు తమ సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుందని కూడా చెప్పారు.
నిజ జీవిత కష్టాలను ఎవరూ ఇష్టపడరు. కఠిన పరిస్థితి, సవాళ్ల నుండి మనసును డైవర్డ్ చేయడం కోసం ప్రస్తుతం అందరు టీవీ, మొబైల్ వాడకం పెంచుతున్నారు. సినిమా, సిరీస్ చూడటం కూడా అందుకే. నిజ జీవితం నుండి దాని ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం ఇవి ఉపయోగపడతాయి.
కొరియన్ సిరీస్ అదే అనుభూతినిస్తుంది. విభిన్న సంస్కృతులు తెలుస్తాయి. వాటిని చూడటం వల్ల కాస్త రిలాక్స్ అవుతారు.. సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చో కూడా తెలుసుకుంటారు. కంటికి ఇంపుగా ఉండే దృశ్యాలు, కొత్త ఫ్యాషన్, సంగీతం మిమ్మల్ని వేరే లోకానికి తీసుకువెళతాయి.
కొరియన్ డ్రామాలు ప్రజల భావాలను రేకెత్తిస్తాయి. అందులోని సంబంధాలు మీ మనసును తాకుతాయి. ఒక ప్రేమకథ చూస్తే దానితో కలిసిపోతుంటారు. ఒకే ఎపిసోడ్‌లో అనేక భావాలను అనుభవించవచ్చు. ఈ సిరీస్ నుండి లభించే తృప్తి మానసిక ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి తగ్గిస్తుంది. కొత్త ప్రయత్నం చేయడానికి ధైర్యాన్నిస్తుంది.
మీ మానసిక స్థితిని ఉత్తేజపరచడానికి కూడా కొరియన్ సిరీస్ సహాయపడుతుంది. అవి కేవలం ప్రేమ, హాస్యం కాదు. ఇతర విషయాలు కూడా ఉంటాయి. ఓటమి, దుఃఖం, స్నేహం, షాక్, సవాళ్లను ఎదుర్కోవడం వంటివి. కొరియన్ సిరీస్‌లలో పెద్ద సవాళ్లను ఎదుర్కొనే పాత్రలు ఉంటాయి. దాని నుండి మీ కష్టాలను ఎదుర్కోవడానికి మార్గం దొరకవచ్చు. కఠిన పరిస్థితిని భయపడకుండా ఎదుర్కోవడానికి ప్రేక్షకులకు ధైర్యాన్నిస్తాయి.
కొరియన్ సిరీస్ అభిమాని అయిన వారు సమాజంలో ఒకరితో ఉంటే వారి మానసిక ఆరోగ్యానికి మంచిది. మీకు నచ్చిన డ్రామాల గురించి మాట్లాడటం ద్వారా ఇతరులతో సంబంధం ఏర్పడుతుంది. దీని వల్ల ఒంటరితనం తొలగిపోయి మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇతరులతో మాట్లాడటం మీ మనసును ఉపశమింపజేస్తుంది.