రవితేజ నటించిన మాస్ జాతర మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో నటీనటుల రెమ్యునరేషన్స్ వివరాలు వైరల్ అవుతున్నాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, శ్రీలీల ఈ చిత్రానికి ఎంత పారితోషికం తీసుకున్నారో ఈ కథనంలో తెలుసుకోండి.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన మాస్ జాతర చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో అంచనాలు ఈ చిత్రంపై భారీగా ఉన్నాయి. గత చిత్రాలతో తాను ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశానని.. ఈ మూవీతో ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచను అని రవితేజ హామీ కూడా ఇచ్చారు. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది.
25
మాస్ జాతర ప్రీ రిలీజ్ బిజినెస్
రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్ కీలక పాత్రల్లో నటించారు.రవితేజ చివరగా నటించిన మిస్టర్ బచ్చన్, ఈగల్, టైగర్ నాగేశ్వర రావు లాంటి చిత్రాలు నిరాశ పరిచాయి. దీనితో మాస్ జాతర మూవీ తప్పనిసరిగా హిట్ కావాల్సిందే అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. వరల్డ్ వైడ్ గా 65 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
35
రవితేజ, శ్రీలీల రెమ్యునరేషన్
రవితేజ ప్రతి చిత్రానికి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే గత చిత్రాలు ఫ్లాప్ కావడంతో కాస్త తగ్గించి మాస్ జాతర చిత్రానికి 25 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల కూడా ఫ్లాఫుల్లోనే ఉంది. అయినప్పటికీ ఆమె రెమ్యునరేషన్ తగ్గడం లేదు. పెరుగుతూనే ఉంది. సాధారణంగా 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునే శ్రీలీల ఈ చిత్రానికి 5 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సంగీత దర్శకుడు భీమ్స్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్ చిత్రానికి కూడా అతడే మ్యూజిక్ డైరెక్టర్. దీనితో భీమ్స్ ఏకంగా మాస్ జాతర చిత్రానికి 8 కోట్లు అందుకుంటున్నారట. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న నరేష్, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ ల రెమ్యునరేషన్ లక్షల్లోనే ఉంటుంది.
55
మాస్ జాతర రవితేజకి చాలా కీలకం
మొత్తంగా మంచి బజ్ ఉన్న మాస్ జాతర చిత్రం 65 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే హిట్ అవుతుంది. రవితేజకి ఈ మూవీ చాలా కీలకం. శ్రీలీల జోరు ఇంకా తగ్గలేదు. ఆమె చిత్రాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ గ్లామర్,డ్ డ్యాన్స్ తో నెట్టుకొచ్చేస్తోంది.