Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు

Published : Sep 15, 2026, 08:54 AM IST

మాస్‌ మహారాజా రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన `మారెమ్మ` మూవీ బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఈ చిత్రం ఏమాత్రం సత్తా చాటడం లేదు. ఆల్మోస్ట్ క్లోజింగ్‌కి చేరుకుంది.

PREV
14
ప్రీమియర్స్ నుంచే మారెమ్మకి నెగటివ్‌ టాక్‌

మాస్‌ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్‌ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతూ `మారెమ్మ` చిత్రంలో నటించాడు. ఇందులో దీపా బాలు హీరోయిన్‌గా నటించింది. మంచాల నాగరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్‌ రెడ్డి బండారు నిర్మించారు. ఇందులో వికాస్‌ వశిష్ట, వినోద్‌ కుమార్‌, వీఎస్‌ రూపాలక్ష్మి, దయానంద్‌ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. గురువారం(సెప్టెంబర్‌ 10) విడుదలైన ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే నెగటివ్‌ టాక్ ని తెచ్చుకుంది. ఇక బాక్సాఫీసు వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

24
మారెమ్మ మూవీకి కనీసం టీ ఖర్చులు కూడా రావడం లేదా

`మారెమ్మ` మూవీ వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, ఈ మూవీకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. కానీ అదే దెబ్బకొట్టింది. ప్రీమియర్స్ కి నెగటివ్‌ రావడంతో అది ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించింది. దీంతో మొదటి రోజు ఈ చిత్రం రూ.15లక్షలు వసూలు చేసింది. రెండో రోజు 9 లక్షలు రాబట్టింది. మూడో రోజు నుంచి దారుణంగా పడిపోయింది. కనీసం టీ ఖర్చులు కూడా రాలేదు. ఆ తర్వాత రోజు రెండు లక్షలు వస్తున్నాయి. సోమవారం కూడా దీనికి రెండు లక్షలు వచ్చాయి. హాలీడేస్‌లోనే ఈ స్థాయిలో వస్తే, ఇక వీక్‌ డేస్‌ లో అంటే, మంగళవారం నుంచి ఈ మూవీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

34
మారెమ్మ మూవీ టోటల్ కలెక్షన్లు

`మారెమ్మ` మూవీకి ఐదు రోజుల్లో రూ.35లక్షల గ్రాస్‌ వచ్చింది. రూ.30లక్షల నెట్‌ కలెక్షన్లు వచ్చినట్టు సాక్నిల్క్ వెల్లడించింది. ఈ వసూళ్లు థియేటర్ ఖర్చులకే సరిపోలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి దాదాపు రూ.7-8కోట్ల వరకు బడ్జెట్‌ అయ్యిందట. హీరోకి రూ.11లక్షలు ఇచ్చినట్టు సమాచారం. నాన్‌ థియేట్రికల్‌గానూ పెద్దగా రాలేదు. ఇప్పుడు థియేట్రికల్ గానూ పెద్ద లాస్‌. ఓవరాల్‌గా ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. రవితేజ తమ్ముడి కొడుక్కిది పెద్ద షాక్‌ అని చెప్పొచ్చు. మంగళవారంతో ఈ మూవీని థియేటర్ల నుంచి ఎత్తేసే పరిస్థితి అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

44
మారెమ్మ మూవీ స్టోరీ ఇదే

గ్రామ దేవత మారెమ్మ చుట్టూ తిరిగే కథ ఇది. మహిషాపురం అనే ఊర్లో గత్తర వచ్చి జనాలు చనిపోతుంటారు. మరోవైపు వరదల కారణంగా ఊరంతా మునిగిపోతుంది. జనాలు బతకలేని పరిస్థితుల్లో వాళ్లకి మారెమ్మ విగ్రహం దొరుకుతుంది. ఆమ్మవారిని ఊరు దేవతగా పూజిస్తారు. దున్నపోతుని బలిస్తారు. దీంతో విఘ్నాలు పోయి అంతా మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఊరు కోసం ఒక దున్నపోతు పుడుతుంది. దీన్ని హీరో పెంచుతాడు. కానీ దాన్ని బలిచ్చే సమయంలో ఆ దున్నుపోతు పారిపోతుంది. విలన్లు దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తారు. అదే జరిగితే ఊరి మరోసారి వల్లకాడు అవుతుంది. మరి దానికోసం హీరో ఏం చేశాడు? ఊరంతా ఏం చేసింది. దున్నపోతు దొరికిందా లేదా? అనేది కథ. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు. స్క్రీన్‌ ప్లే పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు, సినిమా మొత్తం కట్‌ కట్లుగా ఉంది. హీరో మైనస్‌. తెలంగాణ యాసని బలవంతంగా ఇరికించినట్టు ఉంది. ఇందులో అన్నీ ఇరికించినట్టుగానే ఉన్నాయి. దీంతో ఆడియెన్స్‌ పట్టించుకోవడం మానేశారు. మొత్తంగా ఇది డిజాస్టర్ గా నిలవబోతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories