Maremma 10 Days Collections: నిర్మాతలను నిండా ముంచిన మారెమ్మ.. రవితేజ తమ్ముడి కొడుకు మూవీ టోటల్‌ కలెక్షన్లు

Published : Sep 20, 2026, 07:27 AM IST

Maremma Day 10 Collections: రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్‌ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతూ నటించిన `మారెమ్మ` మూవీ గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

PREV
14
నిరాశ పరిచిన రవితేజ తమ్ముడి కొడుకు సినిమా

రవితేజ ఇటీవలే `ఇరుముడి`తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. ఓ వైపు సక్సెస్‌తో రవితేజ ఫుల్‌ జోష్‌లో ఉంటే, మరోవైపు తన తమ్ముడి కొడుకు మాధవ్ మాత్రం నిరాశ పరిచారు. ఆయన హీరోగా పరిచయం అవుతూ `మారెమ్మ` చిత్రంలో నటించాడు. మంచాల నాగరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో దీపా బాలు హీరోయిన్‌గా నటించింది. వినోద్‌ కుమార్‌, రూపాలక్ష్మి, దయానంద్‌ రెడ్డి, వికాస్‌ వశిష్ట ప్రధాన పాత్రలు పోషించారు. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్‌ రెడ్డి బంగారు నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 10న విడుదలైంది.

24
ప్రీమియర్స్ తోనే నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్న మారెమ్మ

ముందుగానే ఈ సినిమాకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. కానీ ప్రీమియర్స్ తోనే నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. మారెమ్మ అనే గ్రామదేవత చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరంతా వరదలతో వల్లకాడుగా మారుతున్న నేపథ్యంలో గ్రామ దేవత మారెమ్మని కొలవడం వల్ల, ఆమెకి దున్నపోతుని బలి ఇవ్వడం వల్ల ఆ విపత్తు తగ్గుతుంది. ఊరు ప్రశాంతంగా ఉంటుంది. అలా మరోసారి అమ్మవారికి దున్నపోతుని బలివ్వాల్సి వస్తుంది. బలిచ్చే దున్నపోతుని హీరో పెంచుతాడు. కానీ బలిచ్చే టైమ్‌లో అది మిస్‌ అవుతుంది. దానికి కారణం ఎవరు? హీరో ఏం చేశాడు? అనేది కథ. ఇందులో తెలంగాణ నేపథ్యం ఒక్కటి తప్ప, మిగిలినవన్నీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. యాసని ఇరికించారు, లవ్‌ స్టోరీని ఇరికించారు. హీరో మాధవ్‌ యాక్టింగ్ బాగా లేదు. ఇలా అన్నీ మైనస్‌లుగానే చెప్పొచ్చు. దీంతో ప్రీమియర్స్ తోనే నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుందీ చిత్రం.

34
థియేటర్ల నుంచి ఎత్తేసిన మారెమ్మ

ఇక మారెమ్మ మూవీకి ఎంత కలెక్షన్లు వచ్చాయి? ఎంత పెట్టారు? సినిమా హిట్టా ఫట్టా అనేది చూస్తే, ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిందని చెప్పొచ్చు. సినిమాకి దాదాపు రూ.8కోట్ల వరకు బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. టీమ్‌ మాత్రం పది కోట్లు అని చెబుతుంది. ఈ సినిమాకి ఓటీటీ బిజినెస్‌ కాలేదని తెలుస్తోంది. కేవలం థియేట్రికల్‌గానే సినిమా సత్తాచాటాల్సి వచ్చింది. కానీ థియేట్రికల్‌గా ఈ మూవీ డీలా పడింది. రెండో రోజు నుంచే దారుణంగా పడిపోయింది. ఇక ఈ మూవీ విడుదలై ఇప్పటి వరకు పది రోజులవుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం మొత్తంగా రూ.43లక్షలు మాత్రమే వచ్చింది. అంతేకాదు శుక్రవారం నుంచే సినిమాని థియేటర్ల నుంచి ఎత్తేశారు.

44
మారెమ్మ టోటల్‌ కలెక్షన్లు.. నిర్మాతలకు మొత్తం పోయిందా?

ప్రస్తుతం మారెమ్మ మూవీ థియేటర్లో లేదు. బుధవారం, గురువారంలో దీనికి కనీసం లక్షల కూడా రాలేదు. శుక్రవారం కొత్త సినిమాలు రావడంతో దీన్ని తీసేశారు. మొత్తంగా `మారెమ్మ` మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు రూ.43లక్షలు మాత్రమే. అంటే ఇరవై లక్షల షేర్‌. అయితే ఈ మూవీకి వచ్చిన కలెక్షన్లు థియేటర్‌ రెంట్లకే సరిపోయిందని సమాచారం. నిర్మాతకి వచ్చింది జీరో. ఇంకా చెప్పాలంటే టీ ఖర్చులు కూడా రాలేదని చెప్పొచ్చు. మొత్తానికి మొత్తం నిర్మాతలు నష్టపోవాల్సి వచ్చింది. ఒక పేరున్న హీరో వారసుడికి ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం. ఇప్పుడు కంటెంట్‌ ఉన్న సినిమాలే ఆడుతున్నాయి. కంటేంట్‌ లేకపోతే పెద్ద హీరోల సినిమాలు కూడా డిజాస్టర్లుగా గా నిలుస్తున్నాయి. దీనికి ఎవరూ అతీతం కారనేది మరోసారి నిరూపితమైంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories