అను.. అంటాడు ఆర్య. అర్థం చేసుకున్న అను తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాన్సీ. సరైన కారణం లేకుండా రీజైన్ చేయటానికి కుదరదు. రిజైన్ చేయడానికి కారణం చెప్పు అంటుంది. నేను ప్రెగ్నెంట్ ని 2,3 డేస్ లో నాకు డెలివరీ ఉంది నేను ఇకపై మీటింగ్స్ లో యాక్టివ్ గా ఉండలేను అందుకే రిజైన్ చేస్తున్నాను అంటుంది. ఇదంతా వద్దు నేను మీ మీద గ్రాటిట్యూడ్ చూపించాలనుకున్నాను చూపించాను అంతేకానీ నేను ఆశించలేదు అంటుంది అంజలి. రాజీనామా చెయ్యొద్దు అంటూ అను ని రిక్వెస్ట్ చేస్తుంది.