నీరజ్, జెండే, ఆర్య ముగ్గురు గుడిలో తలోవైపు వెళ్తారు. గుడిలో ఉన్న అను అమ్మవారిని చూస్తూ నేను ఇలా ఎందుకు వచ్చేసానో నీకు బాగా తెలుసు.. నా భర్తకి నేనంటే ప్రాణం నన్ను వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళ కంట పడకుండా చూసే బాధ్యత నీదే అంటూ మొక్కుకుంటుంది. దండం పెట్టుకుని వెనక్కి తిరిగేసరికి దూరంగా ఆర్య కనిపిస్తాడు. కంగారుపడుతూ మెల్లగా వెనక్కి తప్పుకుంటుంది అను.